6 Airbags In M-1 Category Cars: కారు ప్రమాదాల్లో ప్రాణ నష్టం నివారించే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కార్లలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి కార్లలో ఈ నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. అక్టోబర్ 1, 2022 తర్వాత తయారయ్యే కార్లలో 6 ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తేల్చిచెప్పారు. తరచుగా జరుగుతున్న కారు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరగడానికి సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం ఒక కారణమైతే.. కారులో ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడం మరో ప్రధాన కారణంగా తేలింది. ఈ కారణంగానే ఎం-1 కేటగిరి వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాల్సిందేననే నిబంధనను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి స్పష్టంచేశారు.
కార్లలో ప్రయాణించే వారి రక్షణకే కేంద్రం తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు. నాగపూర్‌లో జరిగిన భారత్ వికాస్ పరిషద్ పశ్చిమ క్షేత్ర సమ్మేళనంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎం-1 కేటగిరి కార్లు అంటే.. డ్రైవర్ సీటు కాకుండా అదనంగా 8 సీట్లకు మించకుండా సీటింగ్ అరేంజ్మెంట్ ఉండే వాహనాలను M-1 కేటగిరి వాహనాలుగా పరిగణిస్తారు.
జనవరి 14నే కేంద్రం ప్రకటన..
ఇటీవల ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ సైరస్ మిస్త్రీ కూడా మాహారాష్ట్రలో జరిగిన కారు ప్రమాదంలోనే మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. సైరస్ మిస్త్రీ మృతితో కారు ప్రయాణం ఎంతవరకు సురక్షితం అనే అంశంపై మరోసారి తెరపైకొచ్చింది. అయితే, అంతకంటే ముందుగానే.. ఈ ఏడాది జనవరి 14నే కేంద్రం ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటూ కార్లలో 6 ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి అనే నిబంధనను (6 Airbags in car) తీసుకొచ్చింది.
Also Read : PM Kisan Latest Update: పీఎం కిసాన్ పథకంలో కీలక మార్పులు..రైతుల కోసం పలు సూచనలు..!
Also Read : Supreme Court: భార్యను బలవంతం చేసినా అత్యాచారమే.. అబార్షన్ చట్టబద్దమే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి