Terror Attack In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పౌరులే లక్ష్యంగా ముష్కరులు దాడులు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు పౌరులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. బాధితులను దీపక్ కుమార్, సతీష్ కుమార్, ప్రీతమ్ లాల్ గా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజౌరి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు.
రాజౌరీ జిల్లాలోని డాంగ్రి గ్రామంలోకి ప్రవేశించిన ఇద్దరు సాయుధులు మూడు ఇళ్లపై కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో మెుత్తం పది మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. వీరిలో రాజౌరి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో ముగ్గురు మృతి చెందారు. అయితే జమ్మూకు తరలించిన మరో వ్యక్తి కూడా చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరినీ మెరుగైన వైద్యం కోసం జమ్మూకు వాయు మార్గం తరలించినట్లు తెలుస్తోంది. రంగంలోకి ప్రభుత్వ బలగాలు ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నాయి.
ఈ ఘటనతో ఆందోళన చెందిన వ్యాపారులు సోమవారం రాజౌరీ జిల్లాలో బంద్ కు పిలుపునిచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా అధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నారు. గత రెండు వారాల్లో జిల్లాలో పౌర హత్యలు జరగడం ఇది రెండోసారి. డిసెంబరు 16న రాజౌరిలోని సైనిక శిబిరం వెలుపల ఇద్దరు పౌరులు మరణించారు.
Also Read: Nashik Factory Fire: నాసిక్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 14 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook