2019-20 మధ్యంతర బడ్జెట్: సంక్షేమానికి పెద్దపీట..ఎవరికి ఏమిచ్చారు..?

                           

Last Updated : Feb 1, 2019, 01:49 PM IST
2019-20 మధ్యంతర బడ్జెట్: సంక్షేమానికి పెద్దపీట..ఎవరికి ఏమిచ్చారు..?

మరి కొన్ని నెల్లలో  సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ లోక్ సభలో 2019-20 మధ్యంతర బడ్జెట్ పెట్టింది. ఆర్ధిక మంత్రి జైట్లీ అనారోగ్యం కారణంగా.. ఆ బాధ్యతలు స్వీకరించిన పియూష్ గోయల్  ఈ రోజు లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మోడీ సర్కార్ కు ఇదే చివరి బడ్జెట్ కావడంతో ..వివిధ వర్గాలను ఆకట్టుకునేలా ఈ బడ్జెట్ రూపొందించారు. ప్రధానంగా రైతులు, కార్మికులు,  నిరుద్యోగ యువతను ఆక్షించేలా బడ్జెట్ రూపొందించారు. అలాగే పేద, మధ్యతరగలికి ప్రయోజనం చేకూర్చేలా అనేక పథకాలు ప్రవేశపెట్టారు.  ఈ నేపథ్యంలో బడ్జెట్ లోని ముఖ్యాంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం...
 

* గత ఐదేళ్లలో  34 లక్షల కోట్ల జనధన్‌ ఖాతాలు 
* ఉజ్వల యోజన కింద  8 కోట్ల ఉచిత వంటగ్యాస్‌ కనెక్షన్లు
*  ముద్ర యోజనలో రూ.7.23 లక్షల కోట్ల రుణాలు 
*  తగ్గిన మొబైల్ రీఛార్జ్ టారీఫ్ ..50 రెట్లు పెరిగిన డేటా వినియోగం 
* శ్రమయోగి బంధన్‌ పేరుతో  60ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.3వేలు పింఛన్‌

* ఇన్ కమ్ టాక్స్ పరిమితి రూ.5లక్షలకు పెంపు
* గ్రాట్యుటీ పరిమితి 30లక్షలకు పెంపు
* పెన్షన్‌లో ప్రభుత్వ వాటా 14శాతానికి పెంపు
* సినిమా నిర్మాణ అనుమతి కోసం సింగిల్‌ విండో విధానం

* అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించాం
* గోకుల్‌ మిషన్‌ కోసం రూ.750కోట్లు కేటాయింపు
* గో ఉత్పాదకత పెంచడానికి రాష్ట్రీయ కామ్‌ధేన్‌ ఆయోగ్‌ ఏర్పాటు
* కార్మిక ప్రమాద బీమా మొత్తం రూ.1.50లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంపు

*  మార్చి లోపు దేశంలో అన్ని ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు
* 22 రకాల పంటలకు మద్దతు ధర పెంపు
* 50 కోట్ల మందికి అండగా ఆయుష్మాన్‌ భారత్‌ 

* గ్రామీణ సడక్‌యోజనలో భాగంగా మూడింతల రహదారుల నిర్మాణం 
* మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి రూ.60వేల కోట్లు 
* గ్రామీణ భారతంలో 98 శాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి

* రక్షణ రంగానికి రూ.3లక్షల కోట్లు
* రైల్వేకు రూ.64,500 కోట్లు కేటాయింపు
*  కాపలాదారులు లేని రైల్వే క్రాసింగ్‌లను తొలగింపు 
* త్వరలో  అత్యధిక వేగంగా ప్రయాణించే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 
* రోజుకు 27కి.మీ. రహదారుల నిర్మాణం

Trending News