ధర్: సెల్ ఫోన్ బ్యాటరీ పేలి 12 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ధర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానిక ఎస్సై సీబీ సింగ్ మాట్లాడుతూ.. బాలుడు తన వద్ద వున్న చైనీస్ మొబైల్ ఫోన్‌లోని బ్యాటరీని మొబైల్ నుంచి వేరు చేసి మరో ప్రత్యేక పరికరంలో విడిగా చార్జింగ్ పెడుతుండగా బ్యాటరీ పేలినట్టు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.