బీదర్: కొత్తగా మోటారు వాహనాల సవరణ చట్టం 2019 అమలులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కర్ణాటకలోని బీదర్‌లో సోమవారం నాడు ట్రాఫిక్ తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు భారీ చలానాలు విధించారు. దీంతో సోమవారం నాడు జరిపిన వాహనాల తనిఖీల్లో 1012 కేసుల్లో పోలీసులు విధించిన చలానాల మొత్తం రూ. 9,72,700గా నమోదైంది.
1012 కేసుల్లో నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్టుగా తేలిన 25 మందిని కోర్టు ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు సైతం జారీ చేశామని బీదర్ జిల్లా ఎస్పీ టి శ్రీధర చెప్పారు.