టిక్కెట్ లేని ప్రయాణం.. ఒకే రోజు 1000 మంది

  

Last Updated : Nov 1, 2017, 09:02 PM IST
టిక్కెట్ లేని ప్రయాణం.. ఒకే రోజు 1000 మంది

తమిళనాడులోని రామేశ్వరం స్టేషన్ అది. కొద్ది క్షణాల్లో అదే స్టేషన్ నుండి రామేశ్వరం - మధురై ప్యాసింజర్ ట్రైన్ బయలుదేరబోతోంది. స్టేషన్ మొత్తం కిక్కిరిసిన జనం.. అయితేనేం ట్రైన్ ఆగి ఆగగానే అందరూ రైలు ఎక్కేశారు. అయితే విచిత్రమేంటంటే ఎక్కినవారెవరూ టికెట్ తీసుకోలేదు. అలా ఎక్కినవారు దాదాపు 1000 మంది ఉన్నారు. దీనికి కారణాన్ని కనుగొన్న రైల్వే అధికారులు విస్తుపోయారు. ఆ స్టేషన్‌లో ఆ రోజు టికెట్ కౌంటరులో ఒక్క ఉద్యోగి కూడా లేకపోవడంతో.. చేసేదేమీ లేక టికెట్ తీసుకోకుండానే ప్రయాణం చేసేశారు జనాలు. రైలు బయలుదేరే సమయం దగ్గరపడుతున్నా, కౌంటర్‌లో ఉద్యోగులు ఎందుకు లేరు? అన్న విషయంపై ఇప్పుడు దర్యాప్తు చేపడుతున్నారు సంబంధిత అధికారులు. రామేశ్వరం - మధురైల మధ్య దూరం దాదాపు 161 కిలో మీటర్లు. ఇంత దూరం టికెట్ తీసుకోకుండా ప్రయాణించిన వారిపై ఎలాంటి చర్య తీసుకోవాలో అర్థం కాక.. వారు కౌంటర్ క్లర్క్  ఎందుకు లేడన్న విషయాన్ని అడిగితే జవాబు చెప్పలేక వాపోతున్నారు సంబంధిత అధికారులు. ప్రతీ రోజూ ఉదయం 5:30 గంటలకు ఈ రైలు రామేశ్వరం నుండి బయలుదేరుతుంది. అయితే ఆ రోజు ఆ సమయానికి హాజరవ్వాల్సిన ఉద్యోగులు ఎందుకు రాలేదన్నది ప్రశ్న. 

Trending News