కేరళను వణికిస్తున్న నిఫా వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య 10కి చేరింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజా మాట్లాడుతూ, నిఫా వైరస్‌కు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది సాంపిల్స్ పరీక్షించగా, అందులో 12 మందికి వ్యాధి సోకినట్టు (పాజిటివ్)గా గుర్తించామని అన్నారు. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు పది మంది మరణించగా, వైరస్ సోకిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆమె తెలిపారు.
As of now, we have test results of 18 samples. 12 of them have been tested positive for #NipahVirus. 10 of them have already died. 2 of them are in critical condition. No new cases have been reported in the last 24 hours: Kerala Health minister KK Shailaja Teacher (File pic) pic.twitter.com/xDA6GG9lGF
— ANI (@ANI) May 22, 2018
కాగా గడిచిన 24 గంటలుగా మాత్రం ఎలాంటి కొత్త కేసుల నమోదు కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోజ్హికోడ్‌లో కేంద్ర వైద్య బృందాన్ని పంపించాలని కోరగా.. స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెంటనే బృందాన్ని పంపించారు. రాష్ట్రంలో వ్యాధి కారణాలను, నివారణ మార్గాలను పరిశీలించి, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నారు.
నిఫాతో నర్సు మృతి
కాగా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న నర్సు లీని(31)కి నిఫా వైరస్ సోకి కన్నుమూసింది. ప్రస్తుతం వ్యాక్సిన్‌లేని ఈ వైరస్ కారణంగా చనిపోవడంతో.. ఆమె మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించకుండా ఆరోగ్య శాఖ విద్యుత్ స్మశాన వాటికలో దహనం చేసింది. కాగా ఈమె భర్త 2 రోజుల క్రితమే గల్ఫ్ నుంచి వచ్చాడు.