World Health Day 2023: ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఆరోగ్య సంబంధిత విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కనీసం ఏడాదికి ఒక్కరోజైనా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం, ఆరోగ్యం ఎందుకు అవసరమనే కీలక విషయాలు చర్చకొస్తుంటాయి. ఈసారి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్థూలకాయం గురించి పరిశీలిద్దాం..
ఆరోగ్యం మహా భాగ్యమన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉన్నంతవరకే ఏదైనా సరే. ఒకసారి ఆరోగ్యం చెడిందంటే వరుస సమస్యలు వెంటాడటం ఖాయం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలి. పోషక పదార్ధాలు పుష్కలంగా తీసుకోవాలి. ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉండాలి. రోజుకు కనీసం కాస్సేపు వ్యాయామం అలవర్చుకోవాలి. ఆరోగ్యం మహత్యం గురించి అవగాహన పెంచుకుంటే బాగుంటుంది. వ్యక్తి జీవితంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారుతోంది. స్థూలకాయం ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. స్థూలకాయంతో నలుగురిలో సిగ్గు పడటమే కాకుండా..శరీరంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. స్థూలకాయం కారణంగా ఏయే రకాల సమస్యలు వెంటాడుతాయో తెలుసుకుందాం..
స్థూలకాయంతో ఎదురయ్యే సమస్యలు
1. బరువు పెరగడం వల్ల వ్యక్తికి ప్రధానంగా డయాబెటిస్ సమస్య ఉత్పన్నమౌతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఎందుకంటే ఒకసారి డయాబెటిస్ సోకితే వదలడం కష్టమే. డయాబెటిస్ రాకుండా ఉండాలంటే బరువు ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి.
2. బరువు పెరగడం వల్ల లివర్‌లో ఫ్యాట్ పేరుకుపోతుంది. ఫలితంగా ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తకుండా ఉండాలంటే బరువు నియంత్రణలో ఉండాలి.
3. బరువు పెరగడం వల్ల అధిక రక్తపోటు సమస్యలు వెంటాడుతాయి. కేలరీలు ఎక్కువగా ఉండే డైట్ తక్కువగా తీసుకోవాలి. ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
4. బరువు పెరగడం వల్ల వ్యక్తికి మూడ్ స్వింగ్ సమస్య ఏర్పడవచ్చు. ఇది మానసిక రుగ్మతకు కారణమౌతుంది. బరువు పెరగడం వల్ల హార్మోన్లలో తేడా వస్తుంది. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
Also read: Fatty Liver: ముఖంపై కన్పించే ఈ లక్షణాలతో ఫ్యాటీ లివర్ పసిగట్టవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook