Neem Oil Benefits: వేప చెట్టు భారతదేశంలో ఎంతో ప్రసిద్ధమైనది. దానిని "సర్వ రోగ నివారణి" అని పిలుస్తారు, అంటే అన్ని రగాలకు నివారణి అని అర్థం. వేప చెట్టు యొక్క వివిధ భాగాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వాటిలో వేప నూనె ఒక ముఖ్యమైన భాగం. ఇది సహజ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంది. వేప నూనె ఆరోగ్యం, సౌందర్యం, వ్యవసాయం రంగాలలో అనేక ప్రయోజనాలను కలిగి ఉంది.
వేప నూనె యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:
చర్మ సంరక్షణ:
వేప నూనె చర్మంపై ఉండే బ్యాక్టీరియా, ఫంగస్‌లను నివారించడానికి సహాయపడుతుంది. ఇది మొటిమలు, మచ్చలను, ఎగ్జిమా వంటి చర్మ సమస్యల చికిత్సలో సహాయపడుతుంది. గాయాలు, దురదలను నయం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.
జుట్టు సంరక్షణ:
వేప నూనె చుండ్రును తగ్గించడానికి, జుట్టు పెరుగుదాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ఇది జుట్టును బలంగా , ఆరోగ్యంగా ఉంచుతుంది.
మధుమేహ నియంత్రణ:
కొన్ని అధ్యయనాలు వేప నూనె రక్తంలో షుగర్ లెవెల్స్‌లను తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నాయి.
కీళ్ల నొప్పులు:
వేప నూనె యొక్క యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడానికి సహాయపడతాయి.
దంత సంరక్షణ:
వేప నూనె నోటి పుతలను నయం చేయడానికి ఎంతో సహాయపడతుంది. అంతేకాకుండా చిగుళ్ల వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది.
పొడి చర్మం:
పొడి చర్మంతో బాధపడేవారు ఈ వేప నూనెను ఉపయోగించడం వల్ల సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఇందులోని విటమిన్-ఇ, అమైనో ఆమ్లాలు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
జలుబు, దగ్గు, జ్వరం వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
ఎలా ఉపయోగించాలి :
వేప నూనెను నేరుగా చర్మంపై ఉపయోగించకూడదు ఎందుకంటే ఇది చికాకు కలిగించవచ్చు. దానిని కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో కలిపి తీసుకోవడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ విధంగా వేప నూనె మనకు ఎంతో సహాయపడుతుంది. దీని మీరు ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. మీరు కూడా ఈ నూనెను ఉపయోగించడం వల్ల అనేక రోగల నుంచి విముక్తి పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter