How to loss overweight, Health tips for healthy life: అధిక బరువు.. స్థూలకాయం, పొట్ట రావడం, లావుగా తయారవడం.. ఇలా పేరు ఏదైనా వాటి గుణం ఒక్కటే.. వాటితో వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా ఒక్కటే. జంక్ ఫుడ్, ఆహారం అలవాట్లు, తీవ్రమైన ఒత్తిళ్లు, విశ్రాంతి లేని జీవితం, విరామం లేకుండా పనులు చేసుకుపోయే ఉరుకుల పరుగుల జీవితం (Busy lifestyle).. వెరసి శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువు పెరగడానికి కారణం అవుతోంది.
Diet lifestyle, healthy food habit - ఆహారం అలవాట్లు:
బరువు పెరిగిన ప్రతీసారి చాలా మంది చేసే పని తాము తీసుకునే ఆహారం అలవాట్లు మార్చుకోవడం. చక్కటి హెల్తీ ఫుడ్ తిని బరువు తగ్గించుకోవాలని భావించడం అందరూ చేసే పనే అయినా.. అందులో చాలా మంది చేసే తప్పేంటంటే.. ఆ చక్కటి ఆహారపు అలవాట్లు అతి కొంత కాలంపాటు లేదా బరువు తగ్గేంత వరకే పాటించడం.
బరువు తగ్గిన తర్వాత మళ్లీ యథావిథిగానే పాత పద్ధతిలో జంక్ ఫుడ్ తినడం లాంటి ఆహారం అలవాట్లు అలవర్చుకోవడంతో కొంత కాలం తర్వాత మళ్లీ బరువు పెరిగి ఒబేసిటి బారిన పడుతుంటారు. అలా కాకుండా ఎప్పటికీ ఒక క్రమ పద్ధతిలో చక్కటి ఆహారం తీసుకునే అలవాట్లు అలవర్చుకుంటే.. ఒబేసిటీ సమస్యకు శాశ్వతంగా ఫుల్స్టాప్ (Permanent solution for Obesity) పెట్టొచ్చు.
Also read : Corona New Variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్, మరీ ప్రమాదకరమంటున్న శాస్త్రవేత్తలు
Workouts or physical activity for fitness - వర్కౌట్స్ లేదా శారీరక శ్రమతో అధిక బరువుకు చెక్:
అధిక బరువును తగ్గించుకునే క్రమంలో చాలా మంది జిమ్‌కి వెళ్లడమో లేదా రన్నింగ్, జాగింగ్, వాకింగ్ లాంటివి చేస్తుంటారు. అవేవి చేయడానికి కుదరని వాళ్లు అధిక బరువును తగ్గించుకోవడం ఎలా అని మదనపడుతుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అధిక బరువు తగ్గించుకోవాలంటే జిమ్‌కి వెళ్లడం, రన్నింగ్ (Health benefits of running), జాగింగ్ చేయడం లాంటివి ఒక్కటే మార్గం కాదు.. మీరు మీ ఇంట్లో ఉండే కొన్ని పద్ధతులు ద్వారా బరువు తగ్గించుకోవచ్చు.
అదేంటంటే.. ఇంట్లోనే ఏదైనా అలసిపోయే పనిని నిత్యం ఒక దినచర్యగా పెట్టుకోవడం, నియమాలు పాటిస్తూ డంబుల్స్ లాంటివి ఎత్తడం, స్విమ్మింగ్ చేయడం, బ్యాడ్మింటన్, వాలీబాల్ లాంటి క్రీడలు ఆడటం లాంటివి ఒక అలవాటుగా చేసుకోవాలి (Easy methods for weight loss). ఇలాంటివి చేయడం వల్ల ఒంట్లో కేలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గి మళ్లీ బరువు పెగరకుండా ఫిట్‌గా ఉంటారు.
Also read : Health benefits of Brown Rice : బ్రౌన్ రైస్‌తో బరువు తగ్గడంతో పాటు బోలెడన్నీ లాభాలు
Sleeping timings - నిద్ర లేమితో అధిక బరువు :
అధిక బరువు తగ్గించుకోవాలంటే చాలా మంది కఠినంగా పాటించే విషయం ఏంటంటే సరైన హెల్తీ డైట్ తీసుకోవడం, ఎక్సర్ సైజెస్ చేయడం. కానీ చాలా మంది నిర్లక్ష్యం చేసే విషయం కానీ అసలు పట్టించుకోని విషయం కానీ ఏదైనా ఉందా అంటే అది నిద్రే. శరీరంలో హార్మోన్స్ సరైన మోతాదులో ఉత్పత్తి కావాలంటే మనిషికి నిద్ర చాలా అవసరం.
అర్థ రాత్రి వరకు మెలకువ ఉండటం (Late night sleeping), తెల్లవారి ఆలస్యంగా లేవడం వంటి అలవాట్ల వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్కి గురై బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. నిద్రలేమి వల్ల ఎక్కువ ఆహారం తీసుకునే ప్రమాదకరమైన అలవాటు అలవడటమే అందుకు కారణం. అలాకాకుండా కంటి నిండా నిద్ర పోతే.. శరీరం కూడా చురుకుగా ఉంటుంది. అధిక బరువు (Overweight) బారినపడకుండా కాపాడుతుంది.
Hydration, Deydration - హైడ్రేషన్, డీహైడ్రేషన్ :
డీహైడ్రేషన్‌కి, అధిక బరువు పెరగడానికి సంబంధం ఏంటని అనుకోవద్దు. ఎందుకంటే ఈ రెండింటికి మధ్య కంటికి కనిపించని ఓ లింక్ ఉంది. నీరు సరిగ్గా తాగకపోతే డీహైడ్రేషన్‌కి గురై మెటాబాలిజంపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. నిత్యం క్రమం తప్పకుండా తగిన మోతాదులో నీరు తీసుకున్నట్టయితే.. శరీరంలో మలినాలు ఎప్పటికప్పుడు బయటికిపోయి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. ఇది బరువు పెరగకుండా (Obeysity problems) ఉండేందుకు ఉపయోగపడుతుంది.
Also read : Green Tea health benefits : గ్రీన్ టీ ఎప్పుడు, ఎలా పుట్టింది, గ్రీన్ టీ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook