Weight Loss Mistakes: మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి నలుగురిలో ఇద్దరికీ బరువు పెరగడం సమస్యగా మారింది. బరువు పెరగడం వల్ల శరీరం అనారోగ్యం పాలవుతోంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు చాలా మంది వ్యాయామాలు చేస్తారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజుకు 5000 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ నడవమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ట్రిక్ ఆశించిన ఫలితం ఇవ్వలేక పోతుంది. కాబట్టి బరువు పెరుగుతున్న వారు పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని పలు రకాల పద్దతులను అనుసరించి శరీరంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఆరోగ్య నిపులు తెలుపుతున్నారు.
రోజు నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు:
రోజూ నడవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అంతేకాకుండా గుండెపోటు వంటి వ్యాధులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే అందరూ బరువు తగ్గాల్సిన అవసరం లేదు. కేవలం వయసులో ఉండకూడని బరువు ఉంటే బరువు తగ్గాలని నిపుణులు పేర్కొన్నారు. శత విధాల బరువును తగ్గడానికి ప్రయత్నించిన బరువు తగ్గకపోతే.. మీ పద్ధతులు, జీవనశైలిలో మార్పులు తీసుకురావడం మంచిదని వారు చెబుతున్నారు.
రోజూ 5000 అడుగులు వేసినా బరువు తగ్గకపోతే ఏం చేయాలి?:
1. బరువు తగ్గాలంటే కేవలం నడకపైనే ఆధారపడకుండా.. అరగంట పాటు వర్కవుట్స్ చేయడం వల్ల కొవ్వు కరిగిపోయి..పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడం మొదలవుతుంది.
2. రోజు తీసుకునే ఆహారంలో జంక్ ఫుడ్‌ను ఆహారంగా తీసుకొకపోవడం మంచిది. ఎందుకంటే అది మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడం కష్టతరం చేస్తుంది.
3. చక్కెర కంటెంట్ చాలా ఎక్కువగా ఉండే ఆహారం నుంచి దూరం ఉండండి. తీపి పదార్థాలు తినడం వల్ల బరువు పెరిగి, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి.
4. ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తీసుకోండి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది.
5. బరువు తగ్గడానికి ఆహారంలో సీజనల్ పండ్లు, మొలకలు, ఆకు కూరలు, నట్స్, సలాడ్లు తినవచ్చు.
6. రోజూ వాకింగ్ చేసేటప్పుడు శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం.
7. నీళ్లే కాకుండా శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను తొలగించే పండ్ల రసాలు, డిటాక్స్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరాన్ని ఫిట్‌గా ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి