Weight Loss In 12 Days: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావడానికి మొదటి కారణం తీసుకునే ఆహారంపై శ్రద్ధ చూపకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే వివిధ తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే బరువు తగ్గే క్రమంలో చాలా మంది మార్కెట్‌లో లభించే అనేక రకాల ఉత్పత్తులను వాడుతున్నారు. వీటి వల్ల తీవ్రమైన దుష్ప్రభావాల వెలుగుచూస్తున్నాయి. అయితే ఆకలి ద్వారా బరువు తగ్గించడానికి వివిధ రకాల చిట్కాలున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆకలి హార్మోన్లు:
శరీరంలో ఆకలిని పుట్టించేందుకు రెండు రకాల హార్మోన్లు ఉంటాయి. వీటిని లెప్టిన్, గ్రెలిన్ అని అంటారు. ఇవి రెండు మన మెదడుకు తినడానికి, త్రాగడానికి అవసరమైన సిగ్నల్స్‌ను ఇస్తాయి. అయితే ప్రతి రోజూ ఆహారం తినే తక్రమంలో లెప్టిన్ హార్మోన్ స్థాయి తగ్గడం మొదలవుతుంది.
ఆకలిని నియంత్రించడానికి సహజ మార్గాలు ఇవే:
1. ప్రోటీన్ గల ఆహారాలు:
పోషకం అంటే చాలా మందికి కండరాలను, శరీరాన్ని దృఢంగా చేస్తుందని తెలుసు.. కానీ ఇది ఆకలిని కూడా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం మీరు ఆహారంలో గుడ్లు, మాంసం, బఠానీలు, సోయా, బీన్స్ వంటి ఆహార పదార్థాలను తీసుకోవచ్చు.
2. ఫైబర్ ఆధారిత ఆహారాలు:
మనం ప్రతి రోజూ ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకుంటారు. ఇందులో ఉండే గుణాలు ఆకలిని నియంత్రించి.. శరీరానికి కావల్సిన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. కావున బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో తప్పకుండా తృణధాన్యాలు, చియా గింజలు, కాయధాన్యాలు, బాదం వంటి పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
3. స్పైసీ ఫుడ్స్:
మసాలాలలో ఆకలిని నియంత్రించే గుణాలుంటాయి. కావున బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా స్పైసీ ఫుడ్స్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
4. వ్యాయామం తప్పనిసరి:
బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గి బరువు తగ్గడం మొదలవుతుంది. కావున శరీర బరువును తగ్గించాలనుకునే వారు తప్పకుండా యోగా, వ్యాయామం చేయాలి.
(NOTE : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం.. బయటికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.