Weight Loss In 10 Days: మారుతున్న జీవశైలి కారణంగా చిన్న వయసులోనే బరువు పెరగడం, మధుమేహం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పడికీ ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారు. ఇలాంటి క్రమంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధవహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కావున బరువు నుంచి ఉపశమనం పొందడానికి రోజూ తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ, వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం.
బరువును నియంత్రించుకునే క్రమంలో శరీరానికి ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు శరీరానికి చాలా అవసరం. ఇవి ఆకలిని కూడా నియంత్రిస్తాయి. కావున బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.
శీతాకాలంలో బరువును తగ్గాలనుకునే వారు తప్పకుండా స్నాక్స్‌లో మఖానా, వేరుశెనగను తీసుకోవాలి. వీటిలో ఉండే పోషకాలు శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఈ రెండింటిలో ఉండే మూలకాలు ఆకలిని నియంత్రిస్తాయి.
వేయించిన మఖానాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే కాల్షియం కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలసట, ఒత్తిడిని నివారించడానికి మఖానా ప్రభావవంతంగా పని చేస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలతో మఖానా తీసుకుంటే మంచి నిద్రను పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు. కండరాల నొప్పిల నుంచి సులభంగా విముక్తి కలుగుతుంది. ఇందులో అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. కావున సులభంగా జీర్ణక్రియను మెరుగుపరుచుతుంది.
చలికాలంలో అందరూ చిరుతిండ్లుగా వేరుశెనగ తినడానికి ఇష్టపడతారు. దీని రుచి చాలా బాగుటుంది కనుక వీటిని తినడానికి మక్కువ చూపుతారు. ఇందులో కొవ్వులు, ప్రోటీన్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే మూలకాలు జీర్ణక్రియను మెరుగు పడుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:ITR Filing: రికార్డు స్థాయిలో ఐటీఆర్ దాఖలు..మరోసారి గడువు పెంచబోతున్నారా..?
Also read:Sourav Ganguly: గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్..బ్యాట్ పట్టనున్న దాదా..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook