Weight Loss At Home: రోజురోజుకి పొట్ట పెరిగిపోతోందా? లావుగా కనిపిస్తున్నారా? ఇలా ఉల్లి రసాన్ని తాగండి చాలు!

Onion For Weight Loss: శరీర బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఉల్లితో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2023, 01:31 PM IST
 Weight Loss At Home: రోజురోజుకి పొట్ట పెరిగిపోతోందా? లావుగా కనిపిస్తున్నారా? ఇలా ఉల్లి రసాన్ని తాగండి చాలు!

Onion For Weight Loss: రోజురోజుకి పొట్ట పెరిగిపోతోందా? లావుగా కనిపిస్తున్నారా? అయితే సహజసిద్ధంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రసాయనాలతో కూడిన వెయిట్‌ లాస్‌ ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్‌లో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. అయితే వీటిని బదులుగా ప్రతి రోజు ఉల్లిపాయను వినియోగించడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉల్లిలో ఉండే పోషకాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అయితే శరీర బరును నియంత్రించుకోవడానికి ఉల్లిని ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఉల్లిపాయను ఎలా శరీర బరువును తగ్గించుకోవడానికి ఎలా వినియోగించాలంటే?:
సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు వ్యాయామాలు చేసిన తర్వాత ఉల్లితో తయారు చేసిన రసాన్ని తాగితే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఉల్లిపాయను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగడం వల్ల కూడా సుభంగా శరీర బరువును నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

ఉల్లిపాయ సూప్:
లంచ్ లేదా డిన్నర్‌ చేసే క్రమంలో ఉల్లిపాయ సూప్‌ను తీసుకోవడం వల్ల కూడా ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే సూప్‌ను తయారు చేసుకునే క్రమంలో నూనెను అతిగా వినియోగించుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

ఆకలిని నియంత్రిస్తుంది:
ఉల్లిపాయలలో శరీరంలో కరిగే ఫైబర్‌తో పాటు పీచు కూడా అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఉల్లిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా తక్కువగా కేలరీలు లభిస్తాయి. దీంతో మీరు ప్రతి రోజు ఉల్లిని తీసుకోవడం వల్ల సులభంగా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. 

ఉల్లిపాయ రసం తయారి విధానం:

ఉల్లిపాయ రసం చేయడానికి ముందుగా ఉల్లిని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టౌవ్‌పై చిన్న బౌల్‌ పెట్టుకుని పై తొక్క తీసిన ఉల్లిని నీటిలో వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బాగా మిక్స్‌ చేసి 20 నిమిషాల పాటు మరిగించాలి. ఈ ఉడికించిన తర్వాత మిక్సీలో వీటిని వేసి జ్యూస్‌లా తయారు చేసుకుని తాగాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News