Warts Removal Tips: ముఖంపై కొంతమందికి ఎర్రటి లేదా నల్లటి కాయలు ఉంటాయి. సూరీడు కాయలుగా పిలిచే వీటివల్ల ముఖ అందం తగ్గిపోతుంది. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ ద్వారా ఇవి తొలగించుకోవచ్చు.

చాలామందికి ముఖంపై సూరీడు కాయల కారణంగా ఇబ్బంది పడుతుంటారు. వీటివల్ల ఆరోగ్యపరంగా ఏ విధమైన నష్టం లేకపోయినా..అందం మాత్రం దెబ్బతింటుంది. చర్మంలో మెలానిన్ ఎక్కువైతేనే ఇవి పుట్టుకొస్తాయి. ఇంకొంతమందికి పుట్టుకతోనే ఉంటాయి. ప్రతి ఇంట్లో లభించే వెల్లుల్లితో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. వెల్లుల్లితో పాటు మరికొన్ని వస్తువులు కలిపి వినియోగిస్తే మంచి ఫలితాలుంటాయి.

వెల్లుల్లి సహాయంతో మీ ముఖంపై లేదా మెడపై వచ్చే సూరీడు కాయల్ని తొలగించుకోవచ్చు. వెల్లుల్లిని ఒలిచి 3-4 రెమ్మల్ని తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వాటిని సూరీడు కాయలపై రాసి బ్యాండేజ్ వేయాలి. దాదాపు 5-6 గంటల తరువాత నీళ్లతో శుభ్రంగా కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయి. ముఖంపై వచ్చే వార్ట్స్ తొలగించేందుకు వెల్లుల్లితో పాటు ఉల్లిపాయల్ని మిక్స్ చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలుంటాయి. ఈ రెండూ కలిపి బాగా పేస్ట్ చేసి రసం పిండాలి. దూది సహాయంతో ఈ రసాన్ని వార్ట్స్‌పై రాయాలి. దాదాపు అరగంట తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

ఆముదం నూనెను సాధారణంగా హెయిర్ గ్రోత్ , జుట్టు పటిష్టత కోసం వినియోగిస్తుంటాం. ఆముదం నూనెను వెల్లుల్లితో కలిపి వాడితే..మొటిమలు లేదా సూరీడు కాయలు దూరమౌతాయి. 2-3 వెల్లుల్లి రెమ్మల్ని తీసుకుని ఆముదం నూనెను కొద్దిగా మిక్స్ చేయాలి. రాత్రి పడుకునేముందు ఎక్కడైతే సూరీడు కాయలు లేదా పులిపిర్లు ఉన్నాయో అక్కడ రాయాలి. ఉదయం శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి. 

Also read: Itchy Scalp Remedies: తలలో తరచూ దురద వేస్తుందా..వర్షాకాలం సమస్యల్నించి ఇలా గట్టెక్కండి

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

English Title: 
Warts removal tips and simple home remedies to remove warts on face with garlic and castor oil
News Source: 
Home Title: 

Warts Removal Tips: సూరీడు కాయలు లేదా పులిపిర్లను ఇలా సులభంగా తొలగించుకోండి

Warts Removal Tips: సూరీడు కాయలు లేదా పులిపిర్లను ఇలా సులభంగా తొలగించుకోండి
Caption: 
Warts removal tips ( file photo)
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Warts Removal Tips: సూరీడు కాయలు లేదా పులిపిర్లను ఇలా సులభంగా తొలగించుకోండి
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Sunday, July 17, 2022 - 16:53
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
172
Is Breaking News: 
No

Trending News