Vitamins Overdose Symptoms: బాడీకి అన్ని పోషకాల మాదిరిగానే విటమిన్లు కూడా చాలా ముఖ్యమైనవి. అయితే విటమిన్ల వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం చాలా మంది విటమిన్లు ఉండే ఆహారాలు అతిగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్ర నష్టాలు కలుగొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు మరి కొందరిలో ఇవి ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.
డైటీషియన్ అభిప్రాయం ప్రకారం విటమిన్‌లను సహజంగా ఆహారం ద్వారా తీసుకున్నప్పుడు శరీరానికి ఎలాంటి హాని జరగకపోవచ్చు. కానీ సప్లిమెంట్ల(క్యాప్సూల్స్) రూపంలో తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా వీటిని తీసుకునే క్రమంలో వైద్యుల సలహా సూచనలు పాటించాల్సి ఉంటుంది.
విటమిన్ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
విటమిన్ ఎ:
విటమిన్ ఎ అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. విటమిన్ ఎ కలిగి ఉన్న ఆహారాన్ని తినడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తీసుకునే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్యాప్సూల్స్‌ను అతిగా తీసుకోవడం వల్ల వాంతులు, ఇంట్రాక్రానియల్ ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
విటమిన్ B3:
విటమిన్ B3ని నియాసిన్ అని కూడా అంటారు. అయితే ఇవి అధికంగా ఉండే ఆహారాలను తీసుకునప్పుడు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో వీటిని అతిగా తీసుకుంటే అధిక బీపీ, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలు వస్తున్నాయని అధ్యాయనాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా వీటిని అతిగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి.
విటమిన్ B6:
విటమిన్ B6ను పిరిడాక్సిన్ అని అంటారు. దీర్ఘకాలం వీటి అధిక మోతాదులో తీసుకుంటే.. నరాల బలహీనత, చర్మంపై సమస్యలు, గుండెల్లో మంటలు వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.
విటమిన్ B9:
విటమిన్ B9ని ఫోలేట్ లేదా ఫోలిక్ యాసిడ్ అని పిలుస్తారు. కాబట్టి వీటిని అధిక మోతాదులో సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటే మానసిక ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశాలున్నాయి.
విటమిన్ B12:
విటమిన్ B12 అధిక మోతాదు తీసుకుంటే తల తిరగడం, వాంతులు, అలసట వంటి సమస్యలు వస్తాయి. అయితే వీటిని ఆహారాల రూపంలో తీసుకున్న వివిధ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తీసుకునే ఆహారంపై ప్రత్యే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
విటమిన్ ఇ:
విటమిన్ ఇ అధిక పరిమాణంలో తీసుకుంటే రక్తం గడ్డకట్టడం, రక్తస్రావం, హెమరేజిక్ స్ట్రోక్‌కు దారితీస్తుంది. కాబట్టి ఈ క్యాప్సూల్స్ తీసుకునే క్రమంలో వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిసన్తున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read : Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచితంగా కావాలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook