Vegetables For Diabetic Patients: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ కూరగాయలను తప్పకుండా ఈ కూరగాయలను తినాలి..!

Vegetables For Diabetic Patients: ప్రస్తుతం చాలా మంది డయాబెటిక్ వ్యాధి బారిన పడుతున్నారు. వివిధ రకాల కలుషిత ఆహారాన్ని తినడం వల్ల  రక్తంలో చక్కెర నియంత్రణ ఉండడం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2022, 04:30 PM IST
  • చాలా మంది డయాబెటిక్ వ్యాధి బారిన పడుతున్నారు
  • దోసకాయ వల్ల రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది
  • పాలకూర వల్ల శరీరానికి చాలా లభాలు
Vegetables For Diabetic Patients: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ కూరగాయలను తప్పకుండా ఈ కూరగాయలను తినాలి..!

Vegetables For Diabetic Patients: ప్రస్తుతం చాలా మంది డయాబెటిక్ వ్యాధి బారిన పడుతున్నారు. వివిధ రకాల కలుషిత ఆహారాన్ని తినడం వల్ల  రక్తంలో చక్కెర నియంత్రణ ఉండడం లేదు. అయితే ఆహారాన్ని తిసుకునే క్రమంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఈ వ్యాధి గ్రస్తులు తప్పకుండా  ఫైబర్, విటమిన్లు,  ఖనిజాలు సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలని వారు చెబుతున్నారు. ముఖ్యంగా పోషకాలు అధికంగా ఉండే కూరగాయలను తీసుకోవాలని నిపుణులు పేర్కొన్నారు. అయితే డయాబెటిక్ రోగులు ఏ కూరగాయలు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ కూరగాయలను తినాలి:

బ్రోకలీ:

బ్రోకలీని సాధారణంగా చాలా మంది ఇష్టపడరు. కానీ ఈ బ్రకోలీ డయాబెటిక్ పేషెంట్లకు చాలా మేలు చేస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్ల పరిమాణం తక్కువగా ఉండడంటం వల్ల ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్ తప్పనిసరిగా బ్రకోలీని తీసుకోవాలి.

బ్రోకలీని ఎలా తినాలి:

బ్రోకలీని ఉడకబెట్టి లేదా సలాడ్, సూప్ మొదలైన వాటిలో వేసుకుని తినోచ్చు.

దోసకాయ:

దోసకాయలో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో కార్బోహైడ్రేట్ల పరిమాణం తక్కువగా ఉండడం వల్ల డయాబెటిక్ రోగులకు ఎంతగానో సహాయపడుతుంద. ఇది జీర్ణవ్యవస్థ మెరుగు పడడానికి సహాయపడుతుంది.

పాలకూర:

బచ్చలికూర మధుమేహంతో బాధపడేవారికి గొప్ప ఔషధంగా పని చేస్తుంది. ఈ కూరగాయలలో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉండటమే కాకుండా చాలా మినరల్స్ ఉంటాయి. కావున ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది.

Also Read: Tulsi Tea Benefits: తులసి టీ వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!

Also Read: Juices For Diabetes Patients: మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ డ్రిక్స్‌ ట్రై చేయండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News