తులసి మొక్కకు ఆధ్యాత్మికంగా మహత్యముంది. ప్రాధాన్యత ఉంది. మరోవైపు ఆరోగ్యపరంగా కూడా తులసి మొక్క అద్భుతమైన ఔషధం. తులసి ఆకులు వివిధ రకాల ఆయుర్వేద ఔషధాల్లో వినియోగిస్తారు. మరి తులసి పాల గురించి విన్నారా..ఆ వివరాలు తెలుసుకుందాం..
తులసి, పాలు రెండూ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఈ రెండింటినీ కలిపి తాగడం వల్ల సూపర్ టానిక్‌గా పనిచేస్తుంది. తులసి ఆకుల్ని పాలతో కలిపి ఉడికించి తాగితే..చాలా రకాల వ్యాధుల్నించి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే తులసి మొక్కకు ఆధ్యాత్మికంగా ఎంత ప్రాధాన్యత ఉందో..ఆరోగ్యపరంగా అంతకుమించిన ప్రాధాన్యత ఉంది. అందుకే చాలా రకాల ఆయుర్వేద ఔషధాల్లో తులసి మొక్క ఆకుల్ని వినియోగిస్తారు.
తులసి పాల ప్రయోజనాలు
చలికాలంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలుతుంటాయి. చలికాలంలో అంటువ్యాధుల ముప్పు అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో తులసి ఆకుల్ని పాలలో ఉడికించి..తాగడం వల్ల జలుబు, దగ్గు వంటివాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. మరోవైపు శరీరం ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. శరీరం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
పని ఒత్తిడి, కుటుంబ టెన్షన్‌ల మధ్య గత కొద్దికాలంగా అందరిలో డిప్రెషన్ ముప్పు పెరుగుతోంది. మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తులసి పాలు యాంటీ డిప్రెషన్‌లా పనిచేస్తుంది. తులసి పాలు తాగడం వల్ల ఆందోళన, ఒత్తిడి దూరమౌతాయి.
పెరుగుతున్న పని ఒత్తిడి లేదా ఏదైనా తెలియని వ్యాధి కారణంగా తలెత్తే తలనొప్పి సమస్యకు తులసి పాలు అద్భుతంగా పనిచేస్తాయి. రోజూ తలనొప్పి సమస్య వేధిస్తుంటే..తులసి పాలు సమూలంగా తగ్గిస్తాయి. ఒకటిన్నర గ్లాసు పాలలో 8-10 ఉతలి ఆకుల్ని వేసి ఉడికించాలి. ఒక గ్లాసు పాలయ్యేవరకూ ఉడికించాలి. ఆ తరువాత గోరువెచ్చగా చేసుకుని తాగాలి.
Also read: Heart Attack: ఈ చిన్న పొరపాటు హార్ట్ ఎటాక్‌కు కారణమై..మీ ప్రాణం తీయవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Tulsi Milk Benefits: తులసి పాల గురించి తెలుసా..రోజూ తాగితే ఆ సమస్యలన్నీ మాయం