Tulsi Leaf With Empty Stomach Benefits: తులసి ఆకులను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగించే ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K వంటి అనేక రకాల విటమిన్లు లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి, చర్మం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు తులసిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, రక్త ప్రసరణకు, నరాల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా వీటిని తినడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి ఆకులను నమిలి తినడం వల్ల కలిగే లాభాలు:
రోగ నిరోధక శక్తి పెరుగుదల:
తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్లో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
జలుబు, దగ్గు నుండి ఉపశమనం:
వానా కాలంలో తులసి ఆకులను నమిలి తినడం వల్ల శ్వాసకోశ వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరచి, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తాయి.
జీర్ణ వ్యవస్థకు మేలు:
తులసి ఆకులను నమిలి తినడం వల్ల ఇందులో ఉండే మూలకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే ఆకలిని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
హృదయ ఆరోగ్యానికి మేలు:
తులసి ఆకులు తినడం వల్ల రక్తపోటు నియంత్రణ ఉంటుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవే కాకుండా ఇతర గుండె సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
మధుమేహం నియంత్రణ:
తులసి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
పళ్లు, చిగుళ్ళ ఆరోగ్యం:
తులసి ఆకులు పళ్లు, చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. తులసి ఆకుల రసం లేదా కషాయాన్ని నోటితో పుక్కిలించి ఊంచడం వల్ల నోటి దుర్గంధం తొలగుతుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.