Fiber Rich Foods: మనిషి ఎదుర్కొనే సమస్య వ్యాధులకు కేంద్ర బిందువు కడుపు. కడుపు నుంచే అన్ని రోగాలు మొదలు కావచ్చు. అంటే జీర్ణ వ్యవస్థ. అందుకే ఎప్పుడైనా మనం తిన్నది సరిగ్గా జీర్ణం కాకుండా ఆ రోజంతా సమస్యాత్మకంగా ఉంటుంది. దైనందిక కార్యక్రమాలకు కూడా విఘాతం కలుగుతుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉండాలంటే ఫైబర్ అధికంగా ఉండే పదార్ధాలు డైట్‌లో ఉండాలి.
మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండాలి. ఫైబర్ అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ బాగుంటుందో మల బద్ధకం సమస్య ఉత్పన్నం కాదు. ఈ నేపధ్యంలో ఫైబర్ అధికంగా ఉండే ఈ 5 పదార్ధాలను ఇవాళ్టి నుంచే మీ డైట్‌లో భాగం చేయడం అలవర్చుకోండి.
ఫైబర్ అధికంగా ఉండే పదార్ధాల్లో ఆకు కూరలు అతి ముఖ్యమైనవి. ఇందులో పాలకూర, మెంతి కూర, గానుగ వంటివి చాలా ముఖ్యం. వీటిలో ఫైబర్‌తో పాటు ఇతర పోషకాలు చాలా పెద్దమొత్తంలో ఉంటాయి. దాంతో జీర్ణక్రి మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఇతర పోషకాల కారణంగా ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. రోజుకు ఒక ఆకు కూరైనా ఉండేట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇక రెండవది చియా సీడ్స్ అండ్ ఫ్లక్స్ సీడ్స్. వీటిలో ఉన్నంత ఫైబర్ మరెందులోనూ లభించదు. దాంతో పాటు ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరం. వీటిని మీరు సలాడ్ లేదా స్మూదీ లేదా పెరుగులో కలిపి తీసుకోవచ్చు. జీర్ణక్రియను మెరుగుపర్చడం, మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి.
తృణ ధాన్యాలు మరో ముఖ్యమైన ఫైబర్ రిచ్ పదార్ధాలు. జొన్నలు, బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటివి కీలకమైనవి. ఇవి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా ఎక్కువసేపు ఆకలేయదు. ముఖ్యంగా ఓట్స్‌లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ కారణంగా కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. ఇక మరో పైబర్ రిచ్ పదార్ధం లెగ్యూమ్స్. అంటే పప్పులు, మటర్, రాజ్మా, మసూర్ దాల్ వంటివి. వీటిలో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. ప్రేవుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు అందుతాయి. జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాకుండా శరీరానికి అవసరమైన అన్ని న్యూట్రిషన్లను అందిస్తాయి.
ఇక చివరిది పండ్లు. ఆపిల్, నాషాపాతీ, ఆరెంజ్, అరటి, నేరేడు వంటి పండ్లలో పెద్దమొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఈ పండ్లు శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
Also read: Honey Precautions: తేనెతో ఈ 5 పదార్ధాలు కలిపి తీసుకుంటున్నారా, అంతే సంగతులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.