Tomato Bajji Recipe: స్ట్రీట్ ఫుడ్‌లో వివిధ రకాల ఆహారపదార్థాలు దొరుకుతాయి. అందులో ముఖ్యంగా పునుగులు, బజ్జీ, వడ ఇతర పదార్థాలు చాలా ఫేమస్. అయితే ఎప్పుడు తినే సాధారణ జబ్జీ కంటే టమాటా జబ్జీని ట్రై చేశారా..? దీని ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. టమాటా బజ్జీ అనేది నోరూరించే స్ట్రీట్ ఫుడ్. దీని సులభంగా తయారు చేసుకోవచ్చు. బయట లభించే ఈ ఆహారం ఇంట్లోనే హైజీనిక్‌గా తయారు చేసుకోవచ్చు.
టమాటా బజ్జీ చేయడానికి కావలసిన పదార్థాలు:
శనగపిండి
ఉప్పు
కారం
అజీనోమోటో
బేకింగ్ సోడా
నీరు
టమాటాలు
ఉడికించిన బంగాళాదుంపలు
ఉల్లిపాయలు
కొత్తిమీర
పచ్చిమిర్చి
గరం మసాలా
కారం
ఉప్పు
నూనె
టమాటా బజ్జీ చేసే విధానం:
టమాటాలను కడిగి, వాటి పైభాగాన్ని కత్తితో కట్ చేసి, లోపలి గుజ్జును తీసేయాలి. ఉడికించిన బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వంటి వాటిని మెత్తగా తరిగి, గరం మసాలా, కారం, ఉప్పు వేసి బాగా మిశ్రమం చేయాలి. తయారు చేసిన స్టఫింగ్‌ను టమాటా లోపల నింపాలి. శనగపిండిలో ఉప్పు, కారం, అజీనోమోటో, బేకింగ్ సోడా వేసి నీరు కలుపుతూ మృదువైన పిండి చేయాలి. స్టఫ్ చేసిన టమాటాలను బజ్జీ పిండిలో ముంచి, వేడి నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
చిట్కాలు:
బజ్జీ పిండిని మరీ జల్లగా చేయకూడదు, లేకుంటే టమాటాలకు పిండి అతుక్కోదు. వేడి వేడిగా వడ్డించిన టమాటా బజ్జీని చట్నీ లేదా సాస్‌తో తీసుకుంటే రుచిగా ఉంటుంది.
టమాటా బజ్జీలు చాలా రుచికరమైన స్నాక్.. టమాటా బజ్జీలో ఉండే ప్రధాన పదార్థం టమాటా. టమాటాలో విటమిన్ సి, లైకోపీన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీని వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. టమాటా తినడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. బజ్జీలో ఉండే పప్పులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఫైబర్ వల్ల ఆకలి త్వరగా తీరి, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. టమాటా బజ్జీలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. ఈ బజ్జీ తయారు చేయడం సులభం, అలాగే ఇది ఇంట్లో ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.
Also Read: Oats Facts: ఓట్స్ ఇలా తింటే గుండె జబ్బులు తప్పవా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.