Onion Benefits In Summer: ఉల్లిపాయలు ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించే ఒక రకమైన కూరగాయ. ఉల్లిపాయలకు ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అయితే వేసవిలో ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఉల్లిపాయలో విటమిన్ సి, బి-6, పొటాషియం, ఫైబర్, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలకు గొప్ప మూలం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
వేసవిలో ఉల్లిపాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఉల్లిపాయలోని కొన్ని రకమైన పోషకాలు శరీర ఉష్ణోగ్రతలను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో ఎండల ప్రభావం అధికంగా ఉండటం కారణంగా బాడీ డీహైడ్రేషన్, అలసట, నీరసం, తలనొప్పి, వాంతులు కలుగుతాయి. అ సమస్యల బారిన పడకుండా ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ఎండకాలంలో చాలా మందిని మలబద్దం, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సమస్యలకు ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుచుతుంది. అధిక రక్తపోటు సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఉల్లిపాయ మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.
ఈ వేసవిలో ఎక్కువగా గుండెపోటు సమస్యలు కలుగుతాయి. దీనికి కారణంగా సరైన ఆహారపదార్థాలు తీసుకోకపోవడం. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఎంతో మేలు కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడంలో ఉల్లిపాయలకు ఎంతో శక్తి ఉంటుంది. అంతేకాకుండా క్యాన్సర్ ప్రమాదన్ని తగ్గిచండంలో ఉల్లిపాయలను మంచి లాభాలు ఉన్నాయి. క్యాన్సర్ కణాలను తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది.
ఉల్లిపాయలోని విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. ఉల్లిపాయలో ఉండే యాంటీహిస్టామైన్ లక్షణాలు అనేక రకమైన అలెర్జీలను తొలగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. ఉల్లిపాయలకు యాంటీ-బాక్టీరియల్ , యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల జలుబు, ఫ్లూ, చెవి నొప్పి మరియు గొంతు నొప్పి వంటి సాధారణ వ్యాధులతో పోరాడటంలో సహాయపడతాయి.
ఉల్లిపాయలను ఆహారంలో ఎలా చేర్చాలి:
ఉల్లిపాయలను పచ్చిగా సలాడ్లలో, సాండ్విచ్లలో లేదా టాకోలలో తినవచ్చు.
వాటిని వేయించి, వేయించి లేదా కూరగాయల వంటకాల్లో ఉడికించి వడ్డించవచ్చు.
ఉల్లిపాయలను సూప్‌లు, స్టూలు మరియు కర్రీలకు రుచిని జోడించడానికి ఉపయోగించవచ్చు.
ఉల్లిపాయ రసం జలుబు మరియు ఫ్లూ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఉల్లిపాయలు రుచికరమైనవి మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వేసవిలో ఉల్లిపాయను పచ్చిగా తినడం, వంటకాల్లో వాడటం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఉల్లిపాయను పచ్చిగా తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే, మీ ఆహారంలో ఉల్లిపాయకు తప్పకుండా చోటు ఇవ్వండి.
Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్లోకి Vivo T3 5G మొబైల్.. పూర్తి వివరాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి