అయుర్వేద ( Ayurveda ) నిపుణుల ప్రకారం పుదీనా వల్ల అలెర్జీలు తగ్గి, అస్తమా నుంచి ఉపశమనం కలుగుతుందట. అందుకే భారతీయ వంటకాల్లో పుదీనా ఆకులను విరివిగా ఉపయోగిస్తుంటారు. చాలా మంది నోటి దుర్వాసన తగ్గించుకోవడానికి కూడా పుదీనా ఆకులను తింటుంటారు.
వైద్యశాస్త్రపరంగాను పుదీనా ఆకుల వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ( Health) ప్రయోజనాలు ఉన్నాయి.
ALSO READ: Wallet for Wealth: పర్సులో ఏం ఉంచాలి ? ఏ రంగు వ్యాలెట్ వల్ల సంపద కలుగుతుంది..
అందులో కొన్ని ఇవే
అలెర్జీ
పుదీనా అలెర్జీలను తగ్గిస్తుంది.
శ్వాస సమస్య..
తరచూ పుదీనా ( Mint ) ఆకులను తీసుకోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో కలిగే ఇబ్బంది తగ్గుతుంది.
బాక్టీరియా నిర్మూలన
ఆహార పదార్ధాల్లో పుదీనా ఆకులను చేర్చడం వల్ల నోటిలో ఉండే హానికరమైన బాక్టీరియా అంతం అవుతుంది.
ALSO Read | Aadhaar PVC Card: పర్సులో పట్టే హైటెక్ ఆధార్ కార్డు
జలుబు, గొంతునొప్పి
వర్షాకాలంలో సాధారంగా వచ్చే జలుబు, గొంతునొప్పి తగ్గడంలో కూడా పుదీనా ఉపయోగపడుతుంది.
ఇమ్యూనిటీ..
పుదీనా ఆకుల్లో ఉండే సీ,డీ, ఈ, బీ విటమిన్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
జీర్ణ ప్రక్రియ..
ప్రతీ రోజు టీలో పుదీనా ఆకులు వేసుకుని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ALSO READ| Health Tips: నీళ్లు తాగే సరైన విధానం ఇదే!
దురద...
చర్మంలోని ఏ ప్రాంతంలో అయినా దురద సమస్య ఉంటే కొన్ని పుదీనా ఆకులను తీసుకుని ఆ భాగంలో రాయండి. సమస్య తగ్గుతుంది.
గొంతు నొప్పి తగ్గాలంటే
మరుగుతున్న నీటిలో కొన్ని పుదీనా ఆకులను, కొంచెం ఉప్పు వేసి కాస్త చల్లారాక తీసుకోవడం వల్ల గొంతునొప్పి తగ్గుతుంది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR