7 Superfoods: ఈ 7 ఫుడ్స్ బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ కు చెక్ పెడతాయి.. అధ్యయనంలో వెల్లడి..

7 Superfoods: ఆరోగ్యపరంగా హెల్తీగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా సరైన లైఫ్‌స్టైల్ పాటిస్తూ హెల్తీ ఆహారాలు తీసుకోంటే ఏ అనారోగ్య సమస్యలు రావు.

Written by - Renuka Godugu | Last Updated : Mar 18, 2024, 11:32 AM IST
7 Superfoods: ఈ 7 ఫుడ్స్ బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ కు చెక్ పెడతాయి.. అధ్యయనంలో వెల్లడి..

7 Superfoods: ఆరోగ్యపరంగా హెల్తీగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా సరైన లైఫ్‌స్టైల్ పాటిస్తూ హెల్తీ ఆహారాలు తీసుకోంటే ఏ అనారోగ్య సమస్యలు రావు. ముఖ్యంగా కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ తీసుకుంటే కూడా బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ కు దూరంగా ఉండొచ్చని ప్రముఖ హార్వార్డ్‌ యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది.

ఆకుకూరలు..
ఆకుకూరల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. ముఖ్యంగా డయాబెటిస్, బీపీతో బాధపడేవారికి ఆకుపచ్చ కూరగాయలు ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీరి డైట్లో ఆకుకూరలు చేర్చుకోవడం ముఖ్యం.

చేప..
మనందరికీ తెలిసిందే చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడేవారికి ఇవి మంచివి. ముఖ్యంగా మాకేరాల్, సాల్మన్ , ట్యూనా, సార్డినెస్ చేపలు మీ డైట్లో చేర్చుకోండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి.

నట్స్..
నట్స్ మనం సాయంత్రం సమయంలో స్నాక్ తీసుకోవాలి. లేదా రాత్రి నానబెట్టిన నట్స్ ఉదయం పరగడుపున తీసుకున్నా ఆరోగ్యానికి మంచివి. ముఖ్యంగా వాల్‌నట్స్, బాదం గుండె జబ్బులను రాకుండా కాపాడతాయి. ఎందుకంటే ఇవి ప్రోటీన్లకు మూలం. ఇందులో మోనోసాచురేటేడ్ కొవ్వులుంటాయి.

తృణధాన్యాలు..
ఇందులో విటమిన్ బీ, ఖనిజాలు, ఫైటోన్యూట్రియేంట్లో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్  మధుమేహం నుంచి రక్షిస్తాయి. అంతేకాదు తృణధాన్యాలను మీ డైట్లో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులు మీ దరిచేరవు.

ఇదీ చదవండి: నాన్ వెజ్ కంటే ఎక్కువ ప్రోటీన్లు లభించే 5 బెస్ట్ వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే

ప్రోబయోటిక్స్..
పెరుగు, క్రూసిఫెరాల్స్ కుటుంబానికి చెందిన కూరగాయలు, చిక్కుళ్లు వంటివి కూడా మీ ఆహారంలో చేర్చుకోండి. ఇవి కూడా మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ నుంచి మిమ్మల్ని కాపాడతాయి.

ఆలివ్ ఆయిల్..
ఇందులో కూడా మోనోసాచురేటేడ్ ఫ్యాట్, పాలీఫెనాల్స్, విటమిన్ ఇ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ సాధారణ వంటనూనెగా వినియోగించుకోవచ్చు.

ఇదీ చదవండి: డయాబెటిస్ రాక ముందే శరీరంలో వచ్చే లక్షణాలు ఇవే.. వీటిని అస్సలు విస్మరించవద్దు!

బెర్రీలు..
ముఖ్యంగా బెర్రీలు బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా వీటిని నేరుగా తినవచ్చు లేదా స్మూథీలకు కూడా జోడించవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News