Is Coconut Malai Good for Health: సాధారణంగా మనం రోడ్లపై ఎక్కడైనా కొబ్బరిబోండం కనిపిస్తే వెంటనే ఆ నీరు తాగుతాం. వేసవి తాపానికి ఈ నీరు మరింత ఆరోగ్యకరం కూడా. కొబ్బరి నీటిని తాగడం వల్ల వడదెబ్బ నుంచి బయటపడొచ్చు. అంతేకాదు కొబ్బరి నీరు రోజంతటికి తగిన శక్తిని ఇస్తుంది. మన శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. అయితే, కొబ్బరినీటి కంటే కొబ్బరి బోండం లోపల ఉండే లేత కొబ్బరి లేదా మీగడ మరింత ఆరోగ్యకరమని పోషక నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరి నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే, చాలామంది కొబ్బరినీటిని తాగి అందులో ఉండే కొబ్బరి మీగడను అలాగే వదిలేస్తారు. అయితే, మీరు అందులోని పోషకాలను సైతం మిస్సయినట్లే. ఆరోగ్యనిపుణుల ప్రకారం కొబ్బరి నీరు మంచి రిఫ్రెష్ డ్రింక్ అయితే, కొబ్బరి బోండలోని లేత కొబ్బరిలో మరిన్ని పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా కొబ్బరి మీగడలో విటమిన్ ఇ, సీ ఐరన్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
ఇదీ చదవండి: యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టే టాప్ 5 మార్నింగ్ డ్రింక్స్..
ఈ బోండంలోని లేత కొబ్బరిలో మనకు రోజంతటికీ కావాల్సిన శక్తిని ఇస్తుంది. మరీ ముఖ్యంగా గర్భిణులకు మంచిది. వారి డైట్లో కొబ్బరి మీగడ కూడా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు బయటకు వెళ్లినప్పుడు లేదా వేసవి కాలంలో వచ్చే అలసటకు ఉపశమనం ఇచ్చి తక్షణ శక్తినిస్తుంది. కొబ్బరి బోండంలోని మీగడలో ఉండే ఆక్సిడేంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి మరింత ఆరోగ్యకరం.
కొబ్బరి మీగడ వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. కొబ్బరి మీగడలో జీర్ణశక్తినిచ్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి మీగడ తింటే బరువు పెరుగుతామనే బాధ ఉండదు. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాదు కొబ్బరి మీగడ కడుపు సమస్యలను నయం చేస్తుంది.
ఇదీ చదవండి: ఈ 8 ఆహారాలు మీ డైట్లో ఉంటే స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి ఈజీగా బయటపడతారు..
సాధారణంగా హడావుడిగా రోడ్లపై కొబ్బరి బోండం తీసుకుని అందులోని నీటిని తాగేసి ఆ బోండాన్ని అక్కడే పడేసి వెళ్లి పోతుంటారు. అయితే, ఈసారి మీరు కూడా కొబ్బరి నీరు తాగితే ఆ బోండంలో ఉండే లేత కొబ్బరిని సైతం కట్ చేయించి తినాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అప్పుడు మీరు పూర్తి పోషకాలు కూడా పొందినట్లవుతుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook