Curd Chutney with Keera : ఈ ఎండా కాలం లో ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయం లో చలువచేసే ఆహారాలను తీసుకోవడం మంచిది. మరి చలువ అనగానే ఈ సమ్మర్ లో మనకి గుర్తొచ్చే మొదటి కూరగాయ కీరా దోసకాయ. ముఖ్యంగా గా కీరాదోస, పెరుగు కలిపి చేసే పచ్చడి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ కీరాదోస పెరుగు పచ్చడి చేయడం చాలా సులువు. మిక్సీ లు, రుబ్బు రోలు లేకుండా ఈ పచ్చడి నిమిషాల్లో చేసేయచ్చు. ముందుగా కీరాదోసను తీసుకొని సన్నగా తురుముకోవాలి. తరువాత ఒక కప్పు పెరుగు తీసుకుని బాగా గిలకొట్టి కీరా ముక్కలు వేసి బాగా కలపాలి.
అందులోనే సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, పుదీనా, క్యారెట్ లో తరుగు వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఆఖరిగా జీలకర్రను వేయాలి అంతే. ఎంతో రుచికరమైన ఈ కీరా పెరుగు పచ్చడి తినే కొద్ది తినాలి అనిపిస్తుంది. దక్షిణ భారతదేశ వంటకాల్లో ఈ పచ్చడి ఒకటి. ఇందులో కొందరు తాళింపు కూడా వేసుకుని తింటారు.
కీరా పెరుగు పచ్చడిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత తిన్నా బరువు పెరగరు. దీని వల్ల పొటాషియం, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్ పెరిగి వేడి వాతావరణంలో కూడా డీహైడ్రేషన్ బారిన పడకుండా సహాయపడతాయి. ఈ కీరా దోసకాయ పచ్చడిలో అల్లం, కరివేపాకు వంటివి కలిపి తింటే ఎంతో మంచిది.
కీరా, పెరుగు ల కలయిక వల్ల వచ్చే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో ఇన్ఫ్లమే షన్ లేకుండా చేస్తాయి. మన శరీరం లోనితేమను బయటికి పోకుండా కాపాడతాయి. ఈ పచ్చడి వల్ల నోటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కీరా లో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు హానికరమైన బ్యాక్టీరియాను చంపి శ్వాస, నోరూ తాజాగా అనిపించేలా చేస్తాయి.
కీరా పెరుగు పచ్చడి వల్ల ఉన్న ఎన్నో ప్రయోజనాల్లో మూత్ర విసర్జన సవ్యంగా అవ్వడం కూడా ఒకటి. శరీరం నుండి వ్యర్ధాలు, విషాలు సులువుగా బయటకు వెళ్లిపోతాయి. కీరా లో సోడియం శాతం తక్కువగా ఉండి పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా కీరాదోస పెరుగు పచ్చడిని తింటే బోలెడు మంచి ఫలితాలు ఉంటాయి.
కిరా దోసకాయ లో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మన శరీరంతో పాటు చర్మం కూడా హైడ్రేట్ అవుతుంది. దానివల్ల చర్మం కూడా కాంతులీనుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరంలో వేడి వల్ల వాటర్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుంది. అలా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా కాపాడుతుంది.
కీర దోసకాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి వాటర్ తో పాటు ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎక్కువ కాలం పొట్ట నిండుగా కూడా అనిపిస్తుంది. కానీ ఎంత తిన్నా బరువు మాత్రం అదుపులోనే ఉంచుతుంది.
Also Read: Cash For Vote: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగియనుందా?
Also Read: Revanth Is Lilliput: 'రేవంత్ రెడ్డి ఒక లిల్లీపుట్': కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter