Sugarcane Juice: హెయిర్ ఫోలికల్స్‌ను తగ్గించడంలో చెరుకు రసం ప్రయోజనాలు ఇవే!

Sugarcane Juice Benefits: వేసవికాలంలో చాలా మంది డీహైడ్రేషన్‌ సమస్యతో బాధపడుతుంటారు. దీని కోసం తీపి పానీయాలను తీసుకుంటూ ఉంటారు. అయితే పనియాల్లో చెరుకు రసం ఒకటి.  దీని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2024, 10:12 PM IST
Sugarcane Juice: హెయిర్ ఫోలికల్స్‌ను తగ్గించడంలో చెరుకు రసం ప్రయోజనాలు ఇవే!

Sugarcane Juice Benefits: చెరుకు రసాన్ని కేవలం వేసవికాలంలోనే కాకుండా ఇతర సీజన్లో కూడా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.  ఈ షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా  ఉంటాం. షుగర్ కేన్ లో ఫైబర్ , ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి.  అంతేకాకుండా కాల్షియం,  మెగ్నీషియం,  ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.చెరుకు రసం తాగడం వల్ల మూత్రం పిండాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే ఎముకలు కూడా బలంగా తయారు అవుతాయి. 

రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజు చెరుకు రసం తాగడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. చెరుకు రసం తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.  దీనివల్ల నీరసం, డీహైడ్రేషన్‌ వంటి సమస్య బారిన పడకుండా ఉంటాం. లివర్ పనితీరు మెరుగుపడచడంలో చెరుకు రసం సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్స్ , మినరల్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ లివర్‌ పనితీరులో సహాయపడుతాయి.

చెడు కొలెస్ట్రాల్స్ తగ్గించడంలో చెరుకు రసం ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్  కణాలు పెరగకుండా సహాయపడుతుంది. 
జీర్ణవ్యవస్థత బాధపడుతున్న వారు చెరుకు రసం తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ఈ చెరుకు రసం తక్కువగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులో షుగర్‌ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి.

Also read: PCOD vs PCOS: PCOD వర్సెస్ PCOS మద్య అంతరమేంటి, లక్షణాలెలా ఉంటాయి

చెరుకులో ఉండే పొలికోసనాల్ అనే పదార్థం కారణంగా దీన్ని అధికంగా వినియోగిస్తే నిద్రలేమి, కడుపునొప్పి, తలతిరగడం, తలనొప్పి, బరువు కోల్పోవడం ఇలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. కాబటి దీని తగిన పరిమాణంలో తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

చెరకు రసం చర్మానికి రాయడం వలన మొటిమలను నయం చేయవచ్చు.   చర్మ రంధ్రాలలో ధూళి పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడతుంది.

చెరకు రసంలో విటమిన్ బి12, విటమిన్ ఎ, విటమిన్ సి ల పోషకాల వల్ల హెయిర్ ఫోలికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

చెరకు రసంలోని తేమ, హైడ్రేటింగ్ లక్షణాలు పొడి తలకు చికిత్సగా ఉపయోగపడుతుంది. గ్లైకోలిక్ యాసిడ్ స్కాల్ప్ బిల్డప్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

Also read: Healthy Eye Sight: మెరుగైన కంటి చూపు కోసం ఈ ఆహార పదార్థాలు తీసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News