Sugarcane Juice For Strong Bones: వేసవిలో మనమందరం చల్లటి పదార్థాలను ఎక్కువగా తినడానికి ఇష్టపడతాము. అందుకే వేసవిలో చాలా మంది శీతల పానీయాలు, పండ్ల రసాలు, మజ్జిగ వంటివి జ్యూస్‌లు తీసుకుంటారు..అయితే వీటిని తాగడం వల్ల ఎలాంటి ఫలితాలు లేకపోయిన ఆరోగ్య నిపుణులు సూచించిన చెరుకు రసం తాగితే మంచి ఫలితాలు కలుగుతాయని సూచిస్తున్నారు. ఈ రసంలో కాల్షియం, ఐరన్ వంటి గుణాలు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా దీనిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా వేసవి కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి ప్రతి రోజూ ఈ చెరకు రసాన్ని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ రసాన్ని తాగడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చెరుకు రసం తాగడం వల్ల కలిగే లాభాలు:
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
చెరకు రసం ఒక సహజ రోగనిరోధక శక్తిని పెంచే రసం. ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు కాబట్టి సులభంగా శరీరానికి శక్తిని కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, ఫోటోప్రొటెక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి సులభంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా అంటువ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
శరీరంలో ఎనర్జీ డ్రింక్‌గా పని చేస్తుంది:
చెరకు రసం ఒక సూపర్ ఎనర్జీ డ్రింక్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా అలసట వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ డ్రింక్ తీసుకోవాల్సి ఉంటుంది. చెరకు రసంలో ఉండే గుణాలు డీహైడ్రేషన్ సమస్యను దూరం చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసాన్ని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది.
ఎముకలు దృఢంగా మారతాయి:
చెరుకు రసం తాగితే ఎముకలు కూడా దృఢంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఈ చెరకు రసాన్ని తాగడం వల్ల ఎముకలు బలోపేతమవుతాయి. అంతేకాకుండా ఎముకల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది:
చెరకు రసం కాలేయానికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు తీసుకువచ్చేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే తీవ్ర కాలేయ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ చెరకు రసాన్ని తాగాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook