/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

Sinus Problems: వాతావరణ కాలుష్యం, పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, వాతావరణంలో వేడి తేమ ఉండటం ఇలా వివిధ కారణాలతో సైనస్ సమస్య ఉత్పన్నమౌతుంది. ఇవి బ్లాక్ అయితే ఇన్‌పెక్షన్ లేదా ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తుంది. అదే మనకు నిత్యం బాధించే సైనసైటిస్. 

ప్రతి మనిషి ముఖంలోని ఎముకల్లో వాక్యూమ్ అంతా గాలితో నిండి పుల్లీ వెంటిలేటెడ్‌గా ఉంటాయి. అయితే ఏదైనా కారణంతో అవి బ్లాక్ అయితే స్వెల్లింగ్, ద్రవం కారడం, నొప్పి, పార్శ్య నొప్పి, వానస కోల్పోవడం, అదే పనిగా తుమ్ములు , నిద్రలేమి ఇలా రకరకాల కారణాలుంటాయి. భరించలేని తలనొప్పి కూడా ఉంటుంది. ముఖం లేదా ముఖంలో ఓ భాగం వాచినట్టుండటం, ముక్కు కారడం వంటి లక్షణాలు చూడవచ్చు. సైససైటిస్ అనేది వయస్సుని బట్టి ఉండదు. ఏ వయస్సువారికైనా రావచ్చు. సాధారమంగా అలెర్జీ ఉండేవారికి లేదా వివిధ రకాల వాతావరణ పరిస్థిలుండే ప్రాంతాలకు వెళ్లడం వల్ల సైనసైటిస్ సంభవిస్తుంది. 

సైనసైటిస్ ఉన్నవారిలో చాలావరకూ ఏకాగ్రత లోపించడం, జ్ఞాుపకశక్తి తగ్గడం, డిప్రెషన్ వంటి సమస్యలు గమనించవచ్చు. అంటే సైనసైటిస్‌కు నరాల సంబంధిత వ్యాధులకు మధ్య సంబంధముంది. అంతేకాకుండా ఏకాగ్రత, శ్రద్ధ లోపించవచ్చు. అంటే పగలంతా నీరసంగా ఉండటం, దేనీపైనా శ్రద్ధ చూపించలేకపోవడం వంటివి ఉండవచ్చు. సైనసైటిస్ అనేది మెదడు పనితీరుని ప్రభావితం చేయడం వల్ల ఇలా జరగవచ్చు.

సైనసైటిస్ రోగానికి పూర్తిగా మందులున్నాయి. చికిత్సా విధానముంది. యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ హిస్టామిన్, స్టెరాయిడ్స్ మందులిస్తారు. మందులతో నయం కాకపోతే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సర్జరీ చేస్తారు. నాసల్ ఎండోస్కోపీ, సైనస్ సిటి స్కాన్ వంటి పరీక్షలతో సైనస్ ఉందా లేదా అనేది నిర్ధారణ జరుగుతుంది. ఏదేమైనా ప్రారంభదశలోనే గుర్తించి చికిత్స చేయించుకుంటే అన్ని విదాలా మంచిది. ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవచ్చు.

సాధారణంగా సైనసైటిస్‌లో రెండు రకాలుంటాయి. ఒకటి ఎక్యూట్ సైససైటిస్, రెండవది క్రానిక్ సైనసైటిస్.  ఎక్యూట్ సైనసైటిస్ 12 వారాల కంటే తక్కువ వ్యవధికి తగ్గిపోతుంది. క్రానికి సైనసైటిస్ మాత్రం 12 వారాలకు మించి ఉంటుంది.

Also read: Tea Side Effects: రోజూ ఇష్టంగా తాగే టీతో గుండెపోటు వస్తుందా, మధుమేహానికి అదే కారణమా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Sinus problems and sinusitis symptoms how to identify sinus problem is there any link between sinusitis and lacking concentration check the details
News Source: 
Home Title: 

Sinus Problems: సైససైటిస్ అంటే ఏమిటి, ఎలా గుర్తించాలి, సైనస్ సమస్యకు ఏకాగ్రతకు లింక్

Sinus Problems: సైససైటిస్ అంటే ఏమిటి, ఎలా గుర్తించాలి, సైనస్ సమస్యకు ఏకాగ్రతకు లింక్ ఉంటుందా
Caption: 
Sinusitis ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Sinus Problems: సైససైటిస్ అంటే ఏమిటి, ఎలా గుర్తించాలి, సైనస్ సమస్యకు ఏకాగ్రతకు లింక్
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, August 28, 2023 - 16:27
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
36
Is Breaking News: 
No
Word Count: 
264