Health Tips: ప్రశాంతమైన నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. సరైన తలగడ..సౌకర్యవంతమైన బెడ్ లేకపోతే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ సమస్య వెంటాడుతుంది. ఎటువంటి తలగడ, పరుపు ఉంటే ఈ సమస్యల్నించి దూరం కావచ్చో తెలుసుకుందాం.
ఆధునిక జీవనశైలిలో చాలా అలవాట్ల కారణంగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ప్రధాన సమస్యగా మారుతుంది. నిద్రలో నెక్ పెయిన్ వచ్చిందంటే..2-3 రోజుల వరకూ తగ్గదు. అందుకే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ సమస్య ఉన్నవారు కొన్ని టిప్స్ పాటిస్తే వాటి నుంచి దూరం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఇందులో ప్రధానమైనవి తలగడ, సరైన పరుపు. వాటి గురించి తెలుసుకుందాం.
నిద్ర సరిగ్గా పట్టకపోతే తలగడ వాడవద్దని చాలా మంది అంటుంటారు. కానీ వాస్తవానికి మంచి నిద్ర రావాలంటే సరైన తలగడ వాడితేనే మంచిదని ఫిజియోథెరపిస్టులు అంటున్నారు. శరీరంలో తలకూ , మిగిలిన బాగానికి ఒకే రకమైన అంటే సమానమైన ఒత్తిడి పడేలా చూసుకుంటే సౌకర్యవంతమైన నిద్ర సాధ్యమవుతుంది. ఎంత మంచి తలగడైనా సరే రెండేళ్లకు మించి వాడకూడదు. ఎందుకంటే రెండేళ్ల తరువాత తలగడ తన కంప్రెషబిలిటీ, ఎలాస్టిసిటీని కోల్పోతుంది. అందుకే చాలామంది తలగడ పెట్టుకున్నా సరే..సపోర్ట్ కోసం భుజాన్ని వాడుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. లేకపోతే నిద్ర సరిగ్గా పట్టకపోగా..కండరాలు పట్టేసి..మెడ నొప్పి ప్రారంభమవుతుంది.
మరి తలగడ ఎలా ఉండాలి
తలగడ మృదువుగా భుజాలు, తల పట్టేంత సైజ్‌లో ఉండాలి. తలగడను కేవలం తలకింద మాత్రమే అమరేలా కాకుండా కొంతభాగం భుజాల కిందకు వచ్చేలా అమర్చుకోవాలి. ఫలితంగా స్పాండిలోసిస్ కారణంగా వచ్చే మెడనొప్పి దూరమవుతుంది. స్పాండిలోసిస్, మెడనొప్పి, భుజాల నొప్పి సమస్యలున్నవారు అనువైన తలగడను ఎంచుకోవాలి. కుటుంబంలో ఎవరి తలగడ వారికి ప్రత్యేకంగా ఉండాలి. తలగడపై ఉండే డస్ట్‌మైట్స్ కారణంగా అలర్జీ, ఆస్తమా రావచ్చు. అందుకే రోజూ వాడే తలగడను శుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లో కవర్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మారుస్తుండాలి.
పరుపు ఎలా ఉండాలి
పరుపు మీద అంటే బెడ్ మీద పడుకోవడం మంచిది కాదని పెద్దలు అంటుంటారు. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ (Back pain)తో బాధపడేవారు పరుపు వాడకూడదని, సర్ఫేస్ గట్టిగా సమాంతరంగా ఉండేవిధంగా చూసుకోవాలని చెబుతుంటారు. వాస్తవానికి ఇది మంచిది కాదు. పరుపు మీద పడుకోవడమే మంచిది. పరుపనేది మృదువుగా ఉండాలి. అలాగని మరీ అందులో కూరుకుపోయేలా ఉండకూడదు. బ్యాలెన్స్‌గా ఉండాలి. గట్టిగా ఉండే ఉపరితలంపై పడుకుంటే శరీరంలోని చాలా భాగాలు నొక్కుకుపోయి..నొప్పి ప్రారంభమవుతుంది. అందుకే పరుపును ఎంపిక చేసేటప్పుడు శరీరానికి ఒత్తుకోకుండా ఉండాలి. అలాగని అందులో కూరుకుపోయేలా ఉండకూడదు. పరుపు వాడే సమయంలో ప్రతివారం తిరగేయడం మంచిది. ఒకేవైపు పడుకుంటే మన బరువంతా ఒకే చోట పడి ఎలాస్టిసిటీ కోల్పోతుంది. ఒక పరుపును మూడేళ్ల వరకూ వాడవచ్చు. తలగడ, పరుపు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ (Neck Pain)సమస్యల్నించి విముక్తి పొందవచ్చు. ఎందుకంటే పడుకునే సమయంలో కండరాలపై సాధ్యమైనంత తక్కువ ఒత్తిడి ఉండేట్టు చూసుకోవాలి.
Also read: Sleep for Beauty: మీకు కావల్సినంత నిద్ర ఉండటం లేదా..అయితే మీ అందం తగ్గుతున్నట్టే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Pillow and Bed: బ్యాక్ పెయిన్..నెక్ పెయిన్ సమస్య వెంటాడుతోందా..అయితే ఇలా చేయండి