Tricolour Spinach Tomato Rice: ఈ గణతంత్ర దినోత్సవానికి ఇలా కొత్తగా ట్రై చేయండి!

Tricolour Spinach Tomato Rice Recipe: భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. అయితే గణతంత్ర దినోత్సవం సమీనిస్తున్న నేపథ్యంలో  ప్రతి ఒక్కరు దేశ భక్తి చెప్పాలి అనేక పద్ధతులు ఈ వేడుకను జరుపుకుంటారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2024, 01:53 PM IST
Tricolour Spinach Tomato Rice: ఈ గణతంత్ర దినోత్సవానికి ఇలా కొత్తగా ట్రై చేయండి!

Tricolour Spinach Tomato Rice Recipe: ఈ  రిపబ్లిక్ డే స్పెషల్  మీ కుటుంబం,అతిథుల కోసం ఇంట్లో వండడానికి ఈ సులభమైన, రుచికరమైన ఈ ట్రైకలర్ స్పినాచ్ టొమాటో రైస్ రెసిపీని ట్రై చేయండి.. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ వంటకాని తయారు చేసుకోవచ్చు.  హెల్త్‌ కు కూడా ఎంతో మంచి ఫలితాలను అందింస్తుంది. దీని కోసం బేబీ బచ్చలికూర ఆకులు, టొమాటో పురీ, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలు మరియు మూలికలు అవసరం

ట్రైకలర్‌ స్పినాచ్ టొమాటో రైస్ రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలు:

పావు కప్పు టొమాటో పురీ, మూడు కప్పుల బాస్మతి రైస్‌, ఒక టీ స్పూన్‌ గరం మసాలా పొడి,  తగినంత నీరు, ఒక టేబుల్‌ స్పూన్‌ వెల్లుల్లి పేస్ట్‌ , తగినంత ఉప్పు, ఒక కప్పు బేబి బచ్చలికూర, నాలుగు టేబుల్‌ స్పూన్ నెయ్యి, ఒక టీ స్పూన్ ఎర్ర మిరపకాయ పొడి, పావు కప్పు ఉల్లిపాయ, ఒక టేబుల్‌ స్పూన్ అల్లం పేస్ట్, రెండు పచ్చిమిర్చి, గార్నిషింగ్ కోసం ఒక స్టార్ సోంపు

ట్రైకలర్ స్పినాచ్ టొమాటో రైస్ తయారి విధానం: 

ముందుగా బియ్యాన్ని నానబెట్టి ఉడికించుకోవాలి. తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. 

ఆ తర్వాత ఒక పాన్‌ తీసుకుని ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇందులోకి అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, బేబీ స్పినాచ్ ఆకులు వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత బియ్యం వేసి చక్కగా టాస్‌ చేయాలి. 

Also read: Diabetes Diet: మధుమేహహం వ్యాధిగ్రస్థులకు వెజ్, నాజ్ వెజ్‌లో ఏది మంచిది

మరో పాన్‌ తీసుకుని అందులో నెయ్యి వేసి తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు, ఎర్ర కారం, టొమాటో ప్యూరీ వేసుకోవాలి. మసాల దినసులకు వేసి  ఉడికించి బియ్యం
వేసుకోవాలి.  మరోసారి టాస్‌ చేసి గరం మసాలా వేయాలి. 

తిరంగా స్టైల్‌లో సర్వ్‌:

చివరిగా బచ్చలికూరను కింద లేయర్‌ గా చేసి మధ్యలో వైట్‌ రైస్‌ను ఉంచుకోవాలి. చివరిగా పైన లేయర్ టొమాటో రైస్‌ వేయాలి. గార్నిష్‌ కోసం స్టార్‌ సోంపుతో సర్వ్‌ చేసుకోవాలి.

Also read: Pregnancy Tips: గర్భిణీ స్త్రీలకు మొదటి 3 నెలలు ఎందుకు చాలా ప్రత్యేకం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News