Stress and Anxiety Remove With Coriander Water: కొత్తిమీరను సాధారణంగా భారతీయులంతా వంటల్లో వినియోగిస్తారు. ఇది ఆహార రుచిని పెంచడమేకాకుండా.. అనారోగ్య సమస్యలను సులభంగా నియంత్రిస్తుంది. అందుకే చాలా మంది అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వినియోగిస్తారు. అయితే చాలా మంది కొత్తిమీర గింజలను నీటిలో నానబెట్టి తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడమేకాకుండా మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ గింజల నీటిని క్రమం తప్పకుండా తాగితే బెల్లీ ఫ్యాట్ తగ్గడమేకాకుండా పలు అనారోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది.
అయితే ఈ గింజల్లో పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఈ గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గడమేకాకుండా మైగ్రేన్ సమస్య నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సమస్యల నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
కొత్తిమీర ప్రయోజనాలు:
1. కొత్తిమీరలో బయోయాక్టివ్ ఫైటోకెమికల్స్‌తో కూడిన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. దీని కారణంగా మైగ్రేన్‌తో సహా ఆందోళన, నిరాశ, ఒత్తిడి వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి.
2. ఈ గింజలతో తయారు చేసిన నీరులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనితో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్, స్ట్రోక్, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
3. ఆధునిక జీవన శైలి కారణంగా ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. దీంతో నిద్రలేమి, ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కొత్తి మీర గింజలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. గింజలను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
4. కొత్తి మీర నీటిని తయారు చేసుకోవడానికి ముందుగా కొత్తిమీర గింజలను తీసుకోవాలి. ఆ తర్వాత నీటిని మరగబెట్టాలి.. ఇలా మరగబెట్టి నీటిని ఫిల్టర్ చేసి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా రుచి పెంచుకోవడానికి అల్లాన్ని కూడా వినియోగించవచ్చు.
Also Read: Halloween stampede: హీరోయిన్ దెబ్బకు 149 మంది మృతి.. వందల మంది ఆసుపత్రి పాలు!
Also Read: Varasudu Business Details: షాకిస్తున్న వారసుడు బిజినెస్ డీటైల్స్.. ఎన్ని కోట్లకు అమ్మారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook