How Reduce Belly Fat: కోవిడ్ కారణంగా చాలా మంది ఇళ్లలోనే ఉండడం వల్ల విపరీతమైన ఆహారాలు అతిగా తినడం వల్ల శరీర బరువు పెరుగుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారిలో బెల్లీ ఫ్యాట్ సమస్యలు కూడా వస్తున్నాయి. శరీర బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీర బరువు పెరగడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి డైట్ పద్ధతిలో ఆహారాలు తీసుకోవడమేకాకుండా పలు డ్రింక్స్ తాగాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా శరీర బరువు తగ్గడమేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
బరువు తగ్గించుకోవడం సులభమైనప్పటికీ బెల్లీ ఫ్యాట్‌ని నియంత్రించుకోవడం చాలా కష్టమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీలకర్ర తయారు చేసిన నీటిని తాగడం వల్ల కూడా సులభంగా బెల్లీ ఫ్యాట్‌ను నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలో, ఈ ఆయుర్వేద గుణాలు కలిగిన నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జీలకర్ర నీటితో శరీర బరువుకు చెక్:
జీలకర్ర ఆహారాల రుచిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడమేకాకుండా, తీవ్ర పొట్ట సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజు జీలకర్ర నీటిని ప్రతి రోజు తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలను కూడా నియంత్రిస్తుంది.
జీలకర్ర డ్రింక్‌ను ఇలా తయారు చేయండి:
ఈ జీలకర్ర డ్రింక్‌ను తయారు చేయడానికి ముందుగా 2 చెంచాల జీలకర్ర తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టండి. ఇలా రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే సన్నని మంటపై మరిగించి ఫిల్టర్ చేసుకుని అందులో నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ డ్రింక్‌ను ప్రతి రోజు రెండు సార్లు తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి