Protein Rich Food: ఈ పండ్లు ప్రతి రోజూ తింటే అనారోగ్య సమస్యలకు చెక్‌..

Protein Rich Food: ప్రస్తుతం చాలా మంది ప్రొటీన్‌ లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించి పండ్లను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2022, 08:54 PM IST
  • జామ, బ్లాక్బెర్రీస్, అరటిపండు,
  • కివి ప్రతి రోజు తింటే ప్రొటీన్‌ ..
  • లోపం సమస్యలు తగ్గుతాయి..
Protein Rich Food: ఈ పండ్లు ప్రతి రోజూ తింటే అనారోగ్య సమస్యలకు చెక్‌..

Protein Rich Food: ప్రొటీన్‌ పేరు వినగానే పప్పులు, మాంసం, గుడ్లు, డ్రై ఫ్రూట్స్‌ పదార్థాలు గుర్తుకు వస్తాయి. ప్రోటీన్ శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలకు, శరీర అభివృద్ధికి ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఎముకలు కూడా బలంగా అవటానికి మరియు శరీరానికి ప్రొటీన్‌  కీలకంగా ఉపయోగపడుతుంది. ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఈ లోపంతో బాధపడుతున్నారు. అయితే ఈ ప్రొటీన్‌ లోపం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పోషకాలు కలిగిన పండ్లేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

ప్రోటీన్ అధికంగా ఉండే పండ్లు:
జామ:

జామపండులో 4.2 గ్రాముల వరకు ప్రొటీన్ లభిస్తుంది. కాబట్టి వీటి క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో  విటమిన్ సి, ఫైబర్ కూడా విచ్చల విడిగా లాభిస్తుంది. కాబట్టి ప్రొటీన్‌ లోపం సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.

బ్లాక్బెర్రీస్:
ఒక కప్పు పచ్చి బ్లాక్‌బెర్రీస్‌లో 2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఒక కప్పు తీసుకుంటే శరీరానికి  8 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు ప్రొటీన్ల లోపాన్ని తగ్గిస్తుంది.

అరటిపండు:
అరటిపండు తరచుగా తింటే శరీరానికి ప్రొటీన్స్‌ లభిస్తాయి. అంతేకాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ప్రతి రోజూ అరటిపండును తీసుకోవాల్సి ఉంటుంది. అరటిపండులో 1.6 గ్రాముల వరకు ప్రొటీన్ లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

కివి:
ఒక కప్పు కివీ ముక్కల్లో 2 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే శరీరంలో ఐరన్ లోపం తీరుతుంది.

Also Read : Matti Kusthi : మొదటి పెళ్లి అందుకే చెడింది.. గుత్తా జ్వాలాకు 24 గంటలు అదే పని.. విష్ణు విశాల్ కామెంట్స

Also Read : Jai Balayya Vs Boss Party : ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు.. తమన్‌పై దేవీ శ్రీ ప్రసాద్ పై చేయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News