Deficiency Of Protein: మన శరీరానికి చాలా పోషకాలు అవసరం. పోషక లోపం సమస్యలు వంటి సమస్యలుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. శరీరంలో తగినంత ప్రోటీన్ ఉంటేనే కండరాలు, చర్మం, ఎంజైమ్‌లు, హార్మోన్ సమస్యలు రావు. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆహారంలో పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పరిశోధనల ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా సుమారు 1 బిలియన్ మంది పోటీన్ లోపం సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. పిల్లలు, వృద్ధులలో ప్రోటీన్ లోపం సమస్యలు చాలా సులభంగా వస్తున్నాయి. దీని వల్ల కండరాలు బలహీనపడతాయి. అంతేకాకుండా కండరాలు నొప్పులు వస్తాయి. ఇంకొందరిలో జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రోజూ మంచి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం చాలా మందిలో ప్రోటీన్ లోపం వల్ల శరీర అలసట, శరీరంలో నొప్పి, కీళ్ళు నొప్పులు, చర్మం పొడిగా మారడం, గోళ్లకు సంబంధించిన సమస్యలు మొదలైనవి వస్తున్నాయి. అంతేకాకుండా ప్రోటీన్ లోపం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రొటీన్ లోపం వల్ల ఏర్పడే దుష్ప్రభావాలు:
ప్రొటీన్ లోపం వల్ల ముఖం, చర్మం, పొట్టలో వాపు సమస్యలు వస్తాయి.
కొందరిలో కొత్త కణాల నిర్మాణం ఆలస్యం అవుతుంది.
తీవ్ర ప్రోటీన్ లోపం వల్ల కండరాల నొప్పులు
పిల్లల్లో ఎత్తు పెరగకపోవటం.
ప్రోటీన్ లోపం రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ప్రోటీన్ లోపం ప్రభావం జుట్టుపై కూడా పడుతుంది. జుట్టు రాలడం, ఇతర చాలా రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చు.
శరీరంలో ప్రోటీన్ కోరత వల్ల కాల్షియం సమస్యలు కూడా వస్తాయి. గోర్లు విరగడం, రంగు మారడం వంటి చాలా రకాల సమస్యలు వస్తాయి.
అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా వస్తాయి. చాలా మందిలో ఉబ్బరం, ఊబకాయం వంటి సమస్యలు కూడా వస్తాయి.
శరీరంలో శక్తి తగ్గడం, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి.
సీజనల్ వ్యాధులు కూడా సులభంగా రావడంతో పాటు ఇన్ఫెక్షన్స్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Samantha Ruth Prabhu : నాకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తోడున్నది అదే : సమంత
Also Read: Deepthi Sunaina : స్ట్రెస్ ఉంది.. అక్కడ చెమటలు పడుతున్నాయ్.. దీప్తి సునయన కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook