Winter Tips: చలికాలం వస్తే చర్మం పొడిబారిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చర్మంతో పాటు జుట్టు కూడా పొడిబారిపోతుంది. అందుకే ఇతర సీజన్లతో పోల్చితే డబుల్ జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే తక్కువ కాలంలోనే జుట్టు రాలే సమస్యతో పాటు ఇతర కేశ సంబంధిత సమస్యలు రెట్టింపు అవుతాయి.
ALSO READ| Dry Cough: ఈ మూడు చిట్కాలు పాటిస్తే పొడిదగ్గు ఇట్టే తగ్గిపోతుంది
చలికాలం జుట్టును కాపాడుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి!
వ్యాసలిన్.. కొబ్బరి నూనె
వ్యాసలిన్‌ను వాడానికి ముందు ఒక చెంచాడు కొబ్బరి (Coconut) నూనె మిక్స్ చేయండి. నూనె గోరువెచ్చగా ఉండాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. తరువాత ఈ మిక్స్‌ను జుట్టుపై అప్లై చేయండి. తలకు అంటకుండా జాగ్రత్తపడండి.
తొలగించే విధానం...
ఈ మిక్స్‌ను తొలగించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ముందుగా ఒక టవల్ తీసుకుని దాన్ని వేడి నీటిలో ముంచి, అందులో నీటిని పిండేయండి. ఇప్పుడు టవల్‌రను మీ జుట్టుకు (Hair) చుట్టేయండి. ఇలా చేయడం వల్ల జుట్టుకు ఉన్న వ్యాసలిన్ సులభంగా వదిలిపోతుంది. తరువాత నార్మల్ షాంపూతో జుట్టును వాష్ చేయండి. తరువాత మీ జుట్టుకు మరేం అప్లై చేసే అవసరం లేదు.
ALSO READ| Health: జీలకర్రతో ఆరోగ్యం మరింత పదిలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe