Oats For Weight Loss: ప్రస్తుతం బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య విముక్తి పొందడానికి పలు రకాల నియమాలు పాటించిన ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే చాలా మంది బరువు తగ్గే క్రమంలో ఆహారం తీసుకోవడం మానుకుంటున్నారు. అంతేకాకుండా చాలా మంది పలు రకాల ఔషధాలను వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా బరువును నియంత్రించుకోవడానికి పలు రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పోషకాలున్న ఆహారాలు కూడా తప్పకుండా తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా డైట్ రూపంలో ఫుడ్‌ను తీసుకోవాలి. ముఖ్యంగా ఓట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏ నియమాలు పాటిస్తే.. బరువు సులభంగా తగ్గుతారో తెలుసుకుందాం.
ఓట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
అల్పాహారంలో ఓట్స్ తినడం వల్ల శరీరానికి కావాల్పిన అన్ని రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో విటమిన్ ఇ, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీర బరువును నియంత్రించి.. బాడీని దృఢంగా చేస్తుంది.
1. మధుమేహం ఉంటే బరువు పెరుగుతారు:
టైప్ 2 మధుమేహం వంటి సమస్యలతో బాధపడేవారు సులభంగా బరువు పెరుగుతారు. అయితే డయాబెటీస్‌తో బదపడే వారు తప్పనిసరిగా అల్పాహారంలో ఓట్స్ తీసుకోవాలి. ఇది బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పని చేస్తాయి.
2. జీర్ణక్రియను మెరుగు పరుచుతాయి:
బరువును తగ్గించుకోవడానికి తప్పకుండా మీరు జీర్ణ క్రియను శక్తి వంతంగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీని కోసం తప్పకుండా ఫైబర్ వంటి పోషకాలున్న ఆహారం తప్పకుండా తీసుకోవాలి. రోజూ అల్పాహారంలో ఓట్స్ తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.
3. ప్రశాంతమైన నిద్ర:
ఓట్స్‌లో మెలటోనిన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి నిద్ర హార్మోన్లను పెంచడానికి సహాయపడతాయి. అయితే వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం బలంగా మారి.. వివిధ రకాల సమస్యలు దూరమవుతాయి.
4. గుండె జబ్బులు:
ప్రతి రోజూ ఓట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే డైటరీ ఫైబర్.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి నియంత్రిస్తాయి.
5. చర్మంపై ప్రభావం:
ఓట్స్‌ను క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకుంటే.. చర్మంపై సమస్యలన్నీ దూరమవుతాయి. ముఖ్యంగా చర్మంపై మంట, దురద, పొడి, చికాకు వంటి సమస్యలు దూరమవుతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్ ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook