Neem Dandruff: చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలను పాటించండి!

Neem Dandruff: జుట్టులోని చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? ఎన్ని చిట్కాలు పాటించినా చుండ్ర సమస్య పోవడం లేదా? అయితే ఈ వేప చిట్కాలను పాటించండి. వేపతో తయారు చేసిన కొన్ని మిశ్రమాల వల్ల డాండ్రఫ్ తగ్గిపోతుంది. అదెలాగో తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 01:23 PM IST
Neem Dandruff: చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలను పాటించండి!

Neem Dandruff: వేపలో ఉండే ఔషధ గుణాల గురించి అందరికీ తెలుసు. వేప వల్ల జుట్టు, చర్మానికి చాలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతో పాటు అనారోగ్య సమస్యల వల్ల జుట్టు నష్టపోకుండా వేప కాపాడుతుంది. అయితే వేప వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వేప ఆకును సరిగ్గా ఉపయోగిస్తే.. జుట్టులో చుండ్రు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. జుట్టులో చుండ్రు సమస్యలు చలికాలం లేదా వేసవి కాలంలో రావొచ్చు. ఈ చుండ్రు సమస్యను పొగొట్టేందుకు వేపాకు ఎంతగానో సహకరిస్తుంది. అయితే జుట్టుపై వేప ఆకును ఉపయోగించడం ఎలానో తెలుసుకోండి. 

1) పెరుగుతో కలిపి..

వేప ఆకుల గుజ్జులో పెరుగు కలపడం వల్ల జుట్టుపై వేగంగా ప్రభావం కనిపిస్తుంది. వేప ఆకులను గుజ్జుగా మార్చి.. ఓ గిన్నెలో తీసుకొని, పెరుగును మిక్స్ చేయాలి. ఆ మిశ్రమాన్ని తలపై పూసుకోవాలి. అర గంట తర్వాత దాన్ని కడిగేయాలి. 

2) తేనెతో కలిపి..

వేప ఆకులను గ్రైండ్ చేసి అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి హెయిర్ కు అప్లే చేయడం వల్ల జుట్టుకు మేలు జరుగుతుంది. 10 నుంచి 20 నిమిషాల తర్వాత దాన్ని కడిగేయాలి. అలా చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 

3) కొబ్బరినూనెతో కలిపి..

వేప ఆకులను కొబ్బరినూనెలో వేసి మరిగించి చల్లార్చి జుట్టుకు పట్టించాలి. ఈ నూనె ద్వారా చుండ్రుకు స్వస్తి చెప్పవచ్చు. వేప, కొబ్బరినూనెల మిశ్రమంతో దురద, మొటిమలు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇన్ఫెక్షన్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. 

4. వేప నీరు

గుప్పెడు వేప ఆకులను సుమారు ఒకటిన్నర లీటర్ల నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని గోరు వెచ్చగా మారిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్యలు పోవడం సహా జుట్టులోని ఇతర సమస్యలు దూరమవుతాయి. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారం కొందరు నిపుణులు చెప్పిన సూచనలు మేరకు అందించబడింది. వాటిని పాటించే ముందు వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.)   

Also Read: Anti Ageing Juice: ఈ పండ్ల రసాలు తాగడం వల్ల ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు!

Also Read: Black Grapes Benefits: నల్ల ద్రాక్ష తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News