Cough Remedy: దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి

Natural Cough Remadies: 24 గంటలన్నా ఎక్కువగా దగ్గు ఉంటే  వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సలహాలు పాటించాలి. మిగితా వారితో భౌతిక దూరాన్ని పాటించాలి. ముఖ్యంగా మాస్క్ ధరించాలి.

Last Updated : Jul 6, 2020, 07:57 PM IST
Cough Remedy: దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి

 

కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతున్న సమయంలో చిన్నపాటి దగ్గు వచ్చినా సరే చుట్టుపక్కల వారు భయపడుతున్నారు. అయితే ఇలా 24 గంటలన్నా ఎక్కువగా దగ్గు ఉంటే వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సలహాలు పాటించాలి. మిగితా వారితో భౌతిక దూరాన్ని పాటించాలి. ముఖ్యంగా మాస్క్ ధరించాలి. అనవసరంగా బయటికి వెళ్లకపోవడం మంచిది. అయితే వైద్యుల సలహాతో పాటు ఈ చిట్కాల వల్ల కూడా మీరు ఉపశమనం పొందవచ్చు. Also Read : Coronaeffect: ఇరవై పోలీస్ స్టేషన్ల మూసివేత..

దగ్గు తగ్గాలి అనుకుంటే ( Cough Relief )

గ్లాసు నీటిలో అర టీ స్పూన్ అల్లం తరుముకు ( Ginger ), కొద్దిగా టీ పౌడర్, మూడు తులసి ( Tulsi Leaves ) ఆకులు వేసి సుమారు పది నిమిషాలు మరిగించాలి. ఈ ద్రవం చల్లారిన తరువాత తాగితే గొంతులో గరగరతో పాటు దగ్గు తగ్గుతుంది. 

పొడి దగ్గు..ఛాతిలో పట్టినట్టు ఉంటే ( Dry Cough )

దీని కోసం ముందు మూడు కప్పుల నీళ్లలో రెండు తమలపాకులు, నాలుగు మిరియాలు ( పొడి ) వేసి కలిపి 15 నిమిషాలు మగరబెట్టి దింపాలి. ఈ మిశ్రమంలో చెంచాడు తేనె ( Honey ) కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి.  Also Read :Harbhajan Singh: పాంటింగ్‌ బ్యాట్‌తో కొట్టేస్తాడేమో అనుకున్నా

దీర్ఘకాలంగా దగ్గు ఉన్నా ( Heavy Cough )

దీర్ఘకాలికంగా దగ్గు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అయితే భవిష్యత్తులో కరోనావైరస్ తగ్గాక పాటించేందుకు ఈ చిట్కా పనికి వస్తుంది. గ్లాసు నీటిలో మూడు మల్బరీ ( Mulberry Leaves ) ఆకులను వేసి పది నిమిషాలు మరగబెట్టాలి. ఇందులో ఎగ్ వైట్ ( Egg White- గుడ్డులోని తెల్లసొన ) మిక్స్ చేసి తాగాలి. 

గొంతు గరగర తగ్గాలంటే

లవంగాలు చప్పరిస్తే గొంతులో గరగర తగ్గుతుంది. దాంతో పాటు పాలలో పసుపు ( Turmeric Milk ) వేసుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది.

గమనిక : ఈ చిట్కాలు ఉపశమనం కలిగించవచ్చు కానీ వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. కరోనావైరస్ సంక్రమిస్తున్న సమయంలో దగ్గు, జలుబు, జ్వరం, వాసన తెలియకపోవడం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను వెంటనే సంప్రదించాలి. కోవిడ్-19 నుంచి రక్షణ నియమాలను తప్పకుండా పాటించాలి. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News