Migraine Also Causes Neck Pain: గతంలో పోల్చితే జీవనశైలిలో మార్పుల కారణంగా పలు అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. అందులోనూ తలనొప్పి లేదా మైగ్రేన్ ముఖ్యమైన సమస్యలు. మైగ్రేన్ అయితే ఇది నాడీ సంబంధ వ్యాధి. దీని చాలా ఇబ్బంది పెడుతుంది. సాధారణంగా మైగ్రేన్ తల(మెదడు)లో ఒక భాగంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. వాంతులు మరియు వికారం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే మైగ్రేన్‌ను కేవలం తలనొప్పిగా కాకుండా ఇది ఇతర శరీర భాగాల శరీరంలోని మిగిలిన భాగాలను సైతం ప్రభావితం చేస్తుందని గమనించండి.
మైగ్రేన్ సమస్య గురించి ఢిల్లీలో మ్యాక్స్ హాస్పిటల్ డాక్టర్ సమీర్ మల్హోత్రా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. 'కొంతమందికి మైగ్రేన్ నొప్పి(Headache)లో ఫోనోఫోబియా సైతం ఉంటుంది. అంటే వీరు అతిపెద్ద శబ్దాలు, ధ్వనులు వింటే వీరికి చిరాకు కలుగుతుంది. కనుక ఈ సమస్య కలిగి ఉన్నవారు ట్రాఫిక్‌కు కాస్త దూరంగా ఉండాల్సి వస్తుంది. తలుపులు గట్టిగా మూయడం లాంటివి చేయవద్దు.
Also Read: Pregnancy Tips: ఇద్దరు పిల్లలకు మధ్య మహిళలు ఎంత Age Gap ఎంత తీసుకోవాలంటే
అదే సమయంలో కొంతమంది మైగ్రేన్(Migraine Problems) బాధితులలో ఫొటోఫోబియా ఉంటుంది. అంటే వీరు తీవ్రమైన, ప్రకాశవంతమైన కాంతిని నేరుగా చూడలేరు. కాంతిని నేరుగా చూసినట్లయితే వీరికి చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆ సమయంలో వీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. కనుక అత్యంత ప్రకాశవంతమైన కాంతిని నేరుగా వీక్షించకూడదని డాక్టర్ సమీర్ సూచించారు.
ముఖం మరియు దవడ భాగాల్లో నొప్పి
మైగ్రేన్ కారణంగా చాలాసార్లు ముఖం, దవడ భాగాల్లో కూడా కొందరికి నొప్పి వస్తుందని డాక్టర్ సమీర్ తెలిపారు. అయితే మెదడు నుండి ముఖం వైపునకు సాగే సిర ఉంటుంది. దీనిని ట్రైజామినల్ నరాలు అని పిలుస్తారు. ఈ సిరల ప్రభావంతో మైగ్రేన్ సమయంలో తలనొప్పితో పాటు కొంతమంది పేషెంట్లకు ముఖం మరియు దవడ భాగాల్లో కూడా నొప్పి వస్తుంది. అందుకు ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకూడదని చెప్పారు.
Also Read: Lemon Water: నిమ్మరసం అధికంగా తాగుతున్నారా, ఈ Side Effects తెలుసుకోండి
మైగ్రేన్ కారణంగా Neck Pain
మైగ్రేన్ సమస్యతో బాధపడే వారిలో మెడ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. మైగ్రేన్ పేషెంట్లలో 40 నుండి 42 శాతం మందికి మెడ నొప్పి(Neck Pain) కూడా వస్తుందని తెలిపారు. కొన్నిసార్లు మెడ నొప్పి ప్రారంభమై తరువాత మైగ్రేన్ వచ్చే అవకాశం ఉందన్నారు. అంటే మెడనొప్పి కొందరిలో మైగ్రేన్‌కు సంకేతంగా భావించవచ్చు.
ఫొటోఫోబియా, వికారం, తలనొప్పి లాంటి లక్సణాలతో పాటు 80 శాతం కేసులలో మెడ నొప్పి సైతం ఉంటుందని గుర్తించారు. కేవలం కొద్దిమంది పేషెంట్లలో మాత్రమే కానీ కొంతమంది పేషెంట్లలో మాత్రమే మెడ నొప్పి ఆ తరువాత రోజుల్లో నేరుగా మైగ్రేన్‌గా మారుతుందని చెప్పారు. కొందరిలో మైగ్రేన్ సమస్యను జయించిన అనంతరం సైతం కొంతమేర మెడనొప్పి వస్తుంటుందని వెల్లడించారు.
Also Read: Back Pain: వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల నడుము నొప్పి వస్తుందా, ఈ Health Tips పాటిస్తే సరి
ఈ విషయాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి
డాక్టర్ సమీర్ ప్రకారం, కొన్ని సందర్భాలలో మైగ్రేన్ యొక్క నొప్పికి గుడ్లు తినడం, విటమిన్ సి లభించే పండ్లు, కెఫిన్, పాల ఉత్పత్తులు, ఆల్కహాల్, గాఢమైన వాసనతో ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల అధిక ఒత్తిడికి గురవుతారు. ఇది మైగ్రేన్ రావడానికి ముందు సూచనగా భావించాలని డాక్టర్ సమీర్ చెబుతున్నారు. కనుక ఇలాంటి అనారోగ్య లక్షణాలతో సతమతమయ్యేవారు త్వరగా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మైగ్రేన్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.
Also Read: Health Tips: ప్రతిరోజు ఉదయాన్నే Hot Water తాగుతున్నారా, ఈ ప్రయోజనాలు తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook