Main Causes Of Belly Fat: బెల్లీ ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది? పెరడానికి ప్రధాన కారణాలు..

Main Causes Of Belly Fat: ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ ఒకటి. దీని కారణంగా కొంతమంది తీవ్ర వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 3, 2024, 10:26 PM IST
Main Causes Of Belly Fat: బెల్లీ ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది? పెరడానికి ప్రధాన కారణాలు..

Main Causes Of Belly Fat: బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. విచ్చలవిడిగా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం కారణంగా బరువు పెరిగి ఈ బెల్లీ ఫ్యాట్ సమస్య బారిన పడుతున్నారు. అయితే కొంతమందిలో ఈ సమస్య ఒత్తిడి కారణంగా కూడా వస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఈ బెల్లీ ఫ్యాట్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది ట్రాన్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగిన ఆహారాలను ఎక్కువగా ఇవ్వడం కారణంగా వస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పిల్లల్లో బెల్లీ ఫ్యాట్ సమస్యలు వస్తే, అతి చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు అవకాశాలున్నాయి. అయితే ఈ సమస్య పిల్లలతో పోలిస్తే ఎక్కువగా పెద్దవారిలోనే అధికమని ఇటీవలే అధ్యయనాల్లో తేలింది. ఈ బెల్లీ ఫ్యాట్ రావడానికి ప్రధాన కారణాలేంటో? నివారణ చర్యలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

బెల్లీ ఫ్యాట్ పెరగడానికి 5 కారణాలు:
ట్రాన్స్ ఫ్యాట్స్:

ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది చాలా హానికరమైన కొవ్వులు. ప్రస్తుతం ఆధునిక జీవనశైలిలో భాగంగా ఇది కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగిన ఆహారాలను అతిగా తీసుకోవడం కారణంగా కూడా వెళ్లి ఫ్యాట్ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఆహారాలను తీసుకోవడం కారణంగా బరువు పెంచడంతో పాటు గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా నూనెలో వేయించిన, ఆహారాలు కాల్చిన, ఆహారాలు ప్యాక్ చేసిన ఆహారాలు తీసుకోకపోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

శారీరక శ్రమ లేకపోవడం:
కొంతమందిలో బెల్లీ ఫ్యాట్ రావడానికి ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గంటల తరబడి కూర్చొని పనులు చేయడం గంటల తరబడి పడుకోవడం కారణంగా శరీరం యొక్క ఫిట్నెస్ తగ్గిపోతుంది. దీనికి కారణంగా కొంతమందిలో బెల్లీ ఫ్యాట్ అధికంగా పెరుగుతుందని వారు అంటున్నారు. కాబట్టి అతిగా కూర్చోవడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆల్కహాల్:
ఆల్కహాల్ లో కేలరీలు అధిక మోతాదులో లభిస్తాయి ఇక పోషకాల విషయానికొస్తే ఇందులో ఒక్కటి కూడా ఉండదు. కాబట్టి ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల సులభంగా బెల్లీ ఫ్యాట్ వస్తుంది. దీంతో పాటు కొంత బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు బెల్లీ ఫ్యాట్ ను నియంత్రించుకోవాలనుకునేవారు తప్పకుండా ఆల్కహాల్ కి దూరంగా ఉండడం ఎంతో మంచిది.

చక్కెర ఆహారాలు:
చాలామందిలో బెల్లీ ఫ్యాట్ రావడానికి ప్రధాన కారణం చక్కెర కలిగిన ఆహారాలు అతిగా తీసుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చక్కెర పరిమాణాలు అధికంగా తీసుకోవడం కారణంగా శరీరంలోని రక్తంలోని చక్కర పరిమాణాలు పెరిగి కొలెస్ట్రాల్ పై ప్రభావం పడుతుంది. దీనికి కారణంగా బెల్లీ ఫ్యాట్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా శుద్ధి చేసిన ఆహారాలు కూల్ డ్రింక్స్ చక్కెర ఎక్కువగా కలిగిన ఆహారాలను తీసుకోకపోవడం ఎంతో మేలు.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

ఒత్తిడి, నిద్ర లేకపోవడం:
ప్రస్తుతం చాలామందిలో ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్యల కారణంగా కూడా బెల్లీ ఫ్యాట్ విచ్చలవిడిగా పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి, ఆందోళన వల్ల శరీరం కార్టిసాల్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. దీనికి కారణంగా కార్టిసాల్ జీవక్రియను నెమ్మదిస్తుంది. కాబట్టి సులభంగా బరువు పెరుగే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా కొంతమందిలో బెల్లీ ఫ్యాట్ వచ్చే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బెల్లీ ఫ్యాట్ రాకుండా ఉండడానికి ప్రతిరోజు 9 గంటలకు మించి నిద్రపోవాలి.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News