Lady Finger For Eye Sight: ఈ రోజుల్లో అప్పుడే పుట్టిన పిల్లల నుండి వృద్ధుల వరకు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కన్ను మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం..కాబట్టి కళ్ళను రక్షించడానికి సాధ్యమైన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నవారు పలు రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రీని వెజిటేబుల్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
బెండకాయ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందా?:
ప్రతి కూరగాయలో ఏదో ఒక విటమిన్ ఉంటుంది. కాబట్టి ప్రతి వారంలో 5 రోజుల పాటు కూరగాయలను తీసుకోవడం శరీరానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు బాడీని అరోగ్యంగా ఉంచడమేకాకుండా కళ్లకు కూడా మంచి ప్రయోజనాలను చేకూర్చుతాయి. అయితే కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ బెండకాయలను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో బీటా కెరోటిన్, జియాక్సంతిన్, లుటీన్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల కంటిలో శుక్లం రాకుండా సహాయపడుతుంది.
కంటి చూపు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఇలా తినండి:
1. ఉదయాన్నే నిద్రలేచి తర్వాత ఖాళీకడుపుతో ఓక్రా వాటర్ తాగడం వల్ల కంటి చూపు సమస్యలు దూరమవ్వడమేకాకుండా చూపు మెరుగు పడుతుంది. కాబట్టి ప్రతి రోజూ ఈ వాటర్‌ను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ ఓక్రా వాటర్‌ను తాగడం వల్ల పొట్టలో సమస్యలు కూడా దూరమవుతాయి.
2. కంటి చూపును పెంచుకోవాలనుకునేవారు ప్రతి రోజూ 2 నుంచి 3 చిన్న సైజు బెండకాయలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూగా తగ్గిస్తుంది.
3. బెండకాయను ఎండలో ఎండబెట్టి పొడిలా తయారు చేసి.. దానిని ఒక గ్లాసు పాలలో కలుపుకుని తాగితే, మంచి ఫలితాలు పొందుతారు.
4. రెట్టింపు ప్రయోజనాలు పొందడానికి బెండకాయలను ముక్కలుగా చేసి రాత్రిపూట నీటిలో నానబెట్టి అల్పాహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Ashu Reddy : జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం!.. అషూ రెడ్డి ముదురు కామెంట్లు
Also Read: Kiara Advani Wedding Pics : కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి.. రామ్ చరణ్ కామెంట్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook