Jeera Water Benefits: జీరా లేదా జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని ప్రతి రోజు తీసుకోవడం ద్వారా మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చని అంటున్నారు. ఇది ఎలా తయారు చేసుకోవాలి..? జీరా వాటర్ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బవుల్ వాటర్, టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మరిగించాలి. తర్వతా లెమన్ రసం కలుపుకోవాలి. ఇలా రోజు తాగ్గడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.
* ఇది మన జీనక్రియ వ్యవస్థను మెరుగుపరచంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున జీరా వాటర్ తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.
* రోగనిరోధక శక్తిని పెంచడంలో జీరా వాటర్ కీలక పాత్ర పోషిస్తుంది. శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు జీరా వాటర్ తీసుకోవడం వల్ల విటమిన్ ఏ, సి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా జీరా వాటర్ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీరో వాటర్ తీసుకోవడం ద్వారా ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. ఐరన్ రక్తహినత సమస్యను రాకుండా ఉండటంలో సహాయపడుతుంది.
* అధిక కేలరీ సమస్యతో బాధపడుతున్నవారు ప్రతిరోజు జీరా వాటర్ తీసుకోవడం కారణంగా కేలరీతో వచ్చే సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
* డయాబెటిస్ ఉన్నవారు బ్లడ్ షూగర్ సమస్యతో బాధపడుతుంటారు. బ్లడ్ షూగర్ లెవల్స్ ని బ్యాలెన్స్ చేయడంలో జీరా వాటర్ సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ నిర్వహణలో సహాయపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి