Immunity booster for winter: చలికాలంలో వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. అయితే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి..? చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
చలికాలంలో చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమయంలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. రోగనిరోధకశక్తిని పెంచే ఆహారపదార్థాలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా విటమిన్ సి, డి రిచ్ ఫుడ్స్‌ను ఎక్కువగా తినడం వల్ల అంటువ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ఆహారంలో నిమ్మకాయ, నారింజ, కివి, బెల్ పెప్పర్ , చేపలు, గుడ్లు, పాలు వంటివి ఎక్కువగా తినడం చాలా మంచిది. అలాగే జింక్ ఉండే పదార్థాలు తీసుకోవాలి అంటే ఆవాలు, బీన్స్, గింజలు వల్ల శరీరం బలంగా ఉంటుంది. ప్రోటీన్ ఫూడ్‌లో చికెన్, మటన్, పాలు, పప్పులు వంటివి తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. వీటితో పాటు ఆకుకూరలు, కూరగాయలు తినడం ముఖ్యం. కారెట్, బీట్ రూట్, స్క్వాష్ , పాలకూర, బ్రోకలీ, కాలే వంటివి తప్పకుండా తినాలి. ఇందులో ఉండే విటమిన్ లు శరీరానికి సహాయపడుతాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి దీని పాలు లేదా నీరుతో కలిపి తాగవచ్చు.
రోగ నిరోధక శక్తిని పెంచే ఇతర మార్గాలు:
వ్యాయామం: రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం శరీరాన్ని చురుగ్గా ఉంచి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
తగినంత నిద్ర: ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్ర లేకపోతే శరీరం సరిగా పని చేయదు.
ఒత్తిడి నిర్వహణ: ధ్యానం, యోగా వంటివి చేయడం ఒత్తిడిని తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
పరిశుభ్రత: తరచూ చేతులు కడుక్కోవడం, ముక్కు, నోరు మూసుకోవడం వంటివి చేయడం వల్ల వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.
కలుషితమైన గాలి నుంచి దూరంగా ఉండండి: కలుషితమైన గాలి శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
కాలానుగుణంగా దుస్తులు ధరించండి: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడం చాలా ముఖ్యం.
ప్రకృతిలో కొంత సమయం గడపండి: సూర్యకాంతి, తాజా గాలి శరీరానికి మంచిది.
సానుకూల ఆలోచనలు: సానుకూల ఆలోచనలు మన మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
నవ్వు: నవ్వడం ఒత్తిడిని తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించాలి.
గమనిక: ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.