Pregnancy Care: ప్రెగ్నెన్సీలో కూడా ఆఫీస్ వర్క్ తప్పదా.. అయితే ఈ టిప్స్ మీకోసమే

Pregnancy Health Care Tips: ప్రతి ఆడపిల్లకి తల్లిగా మారడం అనేది జీవితంలో ఒక అతి గొప్ప వరం. గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మరీ ముఖ్యంగా మీరు ఆ సమయంలో కూడా ఆఫీస్ కి వెళ్లి పని చేసే పని అయితే మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2023, 11:38 AM IST
Pregnancy Care: ప్రెగ్నెన్సీలో కూడా ఆఫీస్ వర్క్ తప్పదా.. అయితే ఈ టిప్స్ మీకోసమే

Pregnancy Health Care Tips: పాతకాలంలో గర్భవతులుగా ఉన్న స్త్రీలను నచ్చిన పని చేసుకుంటూ, హాయిగా తిని, సరదాగా ఉండమని చెప్పేవారు. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు అస్వస్థమైన జీవన శైలి కారణంగా ప్రస్తుతం జనరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పటిలా తీరుబడిగా ఉండడానికి ప్రస్తుతం చాలామందికి కుదరదు. కుటుంబ పరిస్థితుల కారణంగానూ లేక ఇతరతర కారణాల వల్ల ప్రస్తుతం సమాజంలో ఆడవారు కూడా మగవారితో సమానంగా ఉద్యోగం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

ఒక ఉద్యోగం అనే కాదు రంగాల్లో ఆడవారు ఎక్కువగా రాణిస్తున్నారు. కాబట్టి చాలామంది గర్భిణులుగా ఉన్నప్పుడు కూడా ఆఫీసుకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. మామూలుగా ప్రెగ్నెన్సీలో శరీరంపై ప్రభావం పడడమే కాకుండా తల్లి కాబోయే వ్యక్తి మానసిక ఆరోగ్యం పై కూడా కాస్త ప్రభావం ఉంటుంది. ఎప్పుడు ఏం తినాలో తెలియదు, కాస్త అలసటగా అనిపిస్తుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి.. ఇలా వాళ్లకు తెలియకుండానే వాళ్ళ శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి.

గర్భంతో ఉన్న ఆడవారు ఆఫీస్ కి వెళ్లి పని చేయాల్సి వస్తే తప్పనిసరిగా కింద చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ఈ కింది విషయాల్లో తప్పనిసరిగా వారు శ్రద్ధ తీసుకోవాలి..

ఆహారం

ఆహారం అంటే కంటికి కనిపించిందల్లా తినడం కాదు పౌష్టికాహారం తీసుకోవాలి. బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడే కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్ వంటివి మీరు రోజువారి డైట్ లో ఉండేలా చూసుకోవాలి. శరీరానికి ఎక్కువ వేడిని కలిగించే కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి. గర్భం దాల్చిన మహిళలు ఎక్కువగా ఫోలిక్ ఆసిడ్ కంటెంట్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.

జంక్ ఫుడ్ 

చాలామంది ప్రెగ్నెన్సీ  క్రేవింగ్స్ అని అని నచ్చిన జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. అయితే జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ సమయంలో అనవసరమైన బరువు పెరగడమే కాకుండా మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వీలైనంత వరకు జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటూ ఈజీగా డైజెస్ట్ అయ్యే పదార్థాలను తీసుకోవడం మంచిది. మరీ తినాలనిపిస్తే ఏదో ఒకరవంత తినండి తప్ప అదే జీవనాధారం అన్నట్టు తినకండి.

రెస్ట్

ఆఫీసులో అదే పనిగా కూర్చొని లేక నించని పని చేయడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యంతో పాటు కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతుంది. పని మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం కాస్త రెస్ట్ తీసుకోవడం చాలా మంచిది. మరి అసౌకర్యంగా అనిపించినప్పుడు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ని ఉపయోగించుకోవడం బెటర్.

ఒత్తిడి 

పనిచేసే వారికి ఒత్తిడి ఉండడం ఎంతో సహజం కానీ గర్వంతో ఉన్నప్పుడు అనవసరపు ఒత్తిడి తీసుకోవడం మంచిది కాదు. వీలైనంతవరకు స్ట్రెస్ తగ్గించుకోవడానికి ట్రై చేయండి. మెడిటేషన్, యోగ లాంటివి రోజు చేస్తూ ఉంటే మంచిది.

స్నాక్స్ 

ఒకేసారి ఎక్కువగా తీసుకోవడం ప్రెగ్నెంట్ లేడీస్ కి సాధ్యపడదు. కాబట్టి వీలైనంత ఎక్కువసార్లు తక్కువ మోతాదులో తింటూ ఉండడం మంచిది. స్నాక్స్ కింద ఎక్కువగా పండ్లు, డ్రై ఫ్రూట్స్ ,సలాడ్స్ లాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. ప్యాకేజ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ కంటే కూడా నాచురల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఈ సమయంలో తల్లి బిడ్డ ఇద్దరికీ మంచిది.

(గమనిక: ఇది కేవలం నిపుణుల నుంచి సేకరించినటువంటి సమాచారం మాత్రమే. దీన్ని పాటించడానికి ముందు వైద్యులను సంప్రదించడం ఎంతో మంచిది. Zee Telugu News ధ్రువీకరించలేదు.)

Also Read: Oppo Reno10 Pro+ 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Oppo Reno10 Pro+ 5G మొబైల్‌ రూ. 17,549కే..నమ్మట్లేదా?  

Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News