Lemon Water With Honey For Weight Loss: అధిక బరువు నుంచి బయటపడేందుకు చాలామంది వివిధ రకాల చిట్కాలు చెబుతూ ఉంటారు. కానీ వాటిని వినియోగించినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేక పోతారు. బరువు తగ్గాలనుకునేవారు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.. ప్రతిరోజు వ్యాయామాలతో మొదలుకొని తీసుకునే ఆహార పదార్థాల వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రస్తుతం చాలామంది బరువు తగ్గడానికి మార్కెట్లో లభించే అనేక రసాయనాలతో కూడిన డ్రింక్స్ ని విచ్చలవిడిగా తాగుతున్నారు. వీటిని తాగడం ప్రాణానికే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో రసాయనాలతో కూడిన డ్రింక్స్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గినప్పటికీ అతి సులభంగానే మళ్లీ బరువు పెరుగుతున్నారు. అయితే ఇలా కాకుండా శాశ్వతంగా బరువు తగ్గడానికి ఆయుర్వేద నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు.
ఆయుర్వేద శాస్త్రంలో అనేక రకాల చిట్కాలు ఉన్నాయి. కానీ బరువు తగ్గడానికి మాత్రం కొన్ని చిట్కాలు మాత్రమే ఉన్నాయి. చాలామందికి నిమ్మకాయలు మార్కెట్లో అరుదుగా లభిస్తూ ఉంటాయి. అయితే ఈ నిమ్మకాయల తో తయారు చేసిన రసాన్ని పరిగడుపున తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు లెమన్ వాటర్ లో దీనిని కలుపుకొని తాగడం వల్ల అతి సులభంగా మంచి ఫలితాలు పొందే ఛాన్సులు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా లెమన్ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందట.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
లెమన్ వాటర్ లో ఉండే గుణాలు శరీరంలోని కొలెస్ట్రాలను కూడా సులభంగా కలిగిస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలుపుకొని తాగడం వల్ల అతి తొందర్లోనే మంచి ఫలితాలు పొందుతారు. కొంతమంది తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణాలు శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గడమేనని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు లెమన్ వాటర్ ని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా హైడ్రేషన్ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
లెమన్ వాటర్ లోని తేనెను కలుపుకొని తాగడం వల్ల శరీరంలోని వ్యర్ధపదార్థాలన్నీ బయటికి వస్తాయి. అంతేకాకుండా పూర్తిగా పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మూత్రపిండాల్లోని రాళ్ల సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా లెమన్ వాటర్ ని తాగడం వల్ల ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆఫీసుల్లో గంటల తరబడి పనులు చేయడం కారణంగా అలసిపోతూ ఉంటారు. అయితే ఇలాంటి వారికి కూడా లెమన్ వాటర్ చాలా సహాయపడుతుందట.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook