Cholesterol Control Tips: కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అధిక రక్తపోటు, గుండె వ్యాధులకు కారణమౌతుంది. కొన్ని రకాల ఆహార పదార్ధాలు తినడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు. అల్లోవెరా జ్యూస్ ఇందుకు అద్భుతంగా పనిచేస్తుంది. చాలామంది అల్లోవెరా జ్యూస్‌ను సౌందర్య సంరక్షణ, స్కిన్ కేర్‌కు ఉపయోగిస్తారు. కానీ కొలెస్ట్రాల్ వంటి వ్యాధుల్ని నియంత్రించడంలో కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది.
స్కిన్ కేర్
అల్లోవెరా జ్యూస్ చర్మ సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడే ఆయుర్వేద ఔషధం. అందుకే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. అల్లోవెరా జ్యూస్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖానికి కొత్త నిగారింపు చేరుతుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
కొలెస్ట్రాల్ నియంత్రణ
రోజూ క్రమం తప్పకుండా అల్లోవెరా జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్‌తో పాటు అధిక రక్తపోటు, మధుమేహం, గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ ఎప్పుడైతే తగ్గిందో గుండె వ్యాధుల ముప్పు తగ్గి గుండెకు ఆరోగ్యం కలుగుతుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం
చాలామందికి ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అంటే ఇష్టముంటుంది. వీటి కారణంగా కడుపు సంబంధిత సమస్యలు పెరుగుతుంటాయి. ముఖ్యంగా అజీర్తి, మలబద్దకం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఎదురౌతాయి. మలబద్ధకం కారణంగా చాలా అసౌకర్యంగా ఉంటుంది. అల్లోవెరా జ్యూస్ తాగడం వల్ల శరీరంలో మెటబోలిజం పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
Also read: Diabetes Tips: ఈ మూడు సూప్స్ తాగితే మధుమేహం ఇట్టే మాయం, ఎలా చేయాలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook