Heart stroke Symptoms: ఆధునిక బిజీ లైఫ్ కారణంగా గుండెపోటు ప్రధాన సమస్యగా మారింది. గుండెపోటును ముందుగానే ఎలా గుర్తించాలి, ప్రధాన లక్షణాలేంటనేది తెలుసుకుందాం..
ఆధునిక జీవితంలో ఆహారపు అలవాట్లు, నిరంతరం పని ఒత్తిడి, వివిధ రకాల ఆందోళనలు, కాలుష్యం వంటివి మన ఆరోగ్యంపై పెను ప్రభావమే చూపిస్తుంటాయి. ముఖ్యంగా గుండెపోటుకు కారణాల్లో ఇదే ముఖ్యమైనది. అయితే ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం, ఒత్తిడిని జయించడం, అవసరమైన మందులతో గుండెపోటు సమస్యను నివారించవచ్చంటున్నారు వైద్య నిపుణులు. అదే సమయంలో కొన్ని ప్రధాన లక్షణాలతో గుండెపోటు ముప్పును ముందుగానే గుర్తించవచ్చంటున్నారు.
ఎందుకంటే గుండెపోటు అనేది ప్రాణాంతకమైంది. ఒక్కోసారి సమయం కూడా ఇవ్వదు. ఒకే ఒక స్ట్రోక్‌తో ప్రాణాలు తీసేస్తుంది. సరైన్ ఆహారం తీసుకోకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, ఊబకాయం ప్రధాన కారణాలు. అందుకే ఇటీవలి కాలంలో యువతలో కూడా గుండెపోటు సమస్య అధికమైంది. ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాలు అధికంగానే ఉంటున్నాయి. సకాలంలో కొన్ని లక్షణాల ద్వారా గుండెపోటు ముప్పును ముందే గుర్తించవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
ఛాతీ నొప్పి, తీవ్రమైన ఒత్తిడి, అసౌకర్యంగా ఉండటం గుండెపోటు వచ్చే ముందు లక్షణాలే. కొందరికి ఛాతీ మధ్యలో కాస్త నొప్పి లేదా అసౌకర్యంగా ఉండవచ్చు. సాధారణంగా ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. అదే ప్రమాదకరంగా మారుతుంది. ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆకస్మిక మైకం వంటివి కలిగినా విస్మరించకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే గుండెజబ్బులో ఇది సర్వ సాధారణ లక్షణం. మైకం వచ్చినట్టుండటం కానీ..మూర్ఛ కానీ ఉన్నా ప్రమాదకరమే. ఒళ్లంతా చెమటలు పట్టి..వికారంగా ఉండటం కూడా గుండెపోటు లక్షణం కావచ్చు. అందుకే ఎప్పుడైనా ఈ లక్షణాలు కన్పిస్తే..వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకుంటే మంచిది.
గుండెపోటు లక్షణాలు
గుండెపోటు లక్షణాల్ని ముందుగానే గుర్తిస్తే..చాలామంది ప్రాణాలు కాపాడవచ్చు. ప్రారంభంలో వికారం, ఛాతీలో అసౌకర్యం, ఛాతీ బిగుతుగా ఉండటం, ఛాతీ నొప్పి, చెమట పట్టడం, శ్వాస ఇబ్బంది, ఎసిడిటీ, త్రేన్పులు గుండెపోటుకు ప్రారంభ లక్షణాలుగా ఉన్నాయి.
Also read: Mulberry For Health: మల్బరీ తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook