Cholesterol Control Food: కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా అధిక రక్త పోటు, గుండె సమస్యలు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి, మధుమేహం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి తప్పకుండా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రించుకునేందుకు తప్పకుండా పలు రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్లపై లభించి జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవన శైలిలో తక్షణమే మార్పులు చేసుకుని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొలెస్ట్రాల్ నియంత్రణకు ఈ నియమాలు తప్పనిసరి..
>>కొలెస్ట్రాల్ నియంత్రించుకునే క్రమంలో కచ్చితంగా వెల్లుల్లి ఆహారంలో వినియోగించాలి. ప్రతిరోజూ 2 నుంచి 3 మొగ్గలను నమలండి.
>>పాలు, చాయ్‌లో పంచదార వేసుకుని తాగడం వంటి అలవాటును మార్చుకోండి. టీకి బదులుగా గ్రీన్ టీ తాగండి.
>>కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ప్రతిరోజూ పసుపు పాలు తాగండి.
>> అవిసె గింజలు తినడం అలవాటు చేసుకోండి.
>>పచ్చి కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి.
>> నూనె ఉన్న పదార్థాలను తీసుకోవద్దు.
ఈ అలవాట్లను మానుకోండి:
>>ధూమపాన వ్యసనాన్ని వదిలేయండి.
>>రోజుకు 8 గంటల కంటే తక్కువ నిద్రపోకండి.
>>సంతృప్త కొవ్వు ఉన్న వాటిని తినవద్దు.
>>జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి.
>>చక్కెర, ఉప్పును పరిమితంగా తీసుకోవాలి.
>>ఎక్కువగా వ్యాయామం చేయండి
>>తక్కువ కార్బోహైడ్రేట్ ఉండే ఆహారాన్ని తిసుకోండి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:ITR Filing: రికార్డు స్థాయిలో ఐటీఆర్ దాఖలు..మరోసారి గడువు పెంచబోతున్నారా..?
Also read:Sourav Ganguly: గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్..బ్యాట్ పట్టనున్న దాదా..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook