Honey Benefits for Skin: తేనెతో ఎన్నో ప్రయోజనాలు.. చర్మవ్యాధి సమస్యలకు స్వస్తి!

Honey Benefits for Skin: తేనె వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే శరీరానికి ఉపయోగాలతో పాటు అనేక అనారోగ్య సమస్యలకు మందుగా పనిచేస్తుంది. చర్మంపై ఏర్పడే ఇన్ఫెక్షన్లకు ఈ తేనె ద్వారా చికిత్స పొందవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2022, 05:57 PM IST
Honey Benefits for Skin: తేనెతో ఎన్నో ప్రయోజనాలు.. చర్మవ్యాధి సమస్యలకు స్వస్తి!

Honey Benefits for Skin: పూర్వం తేనెను ప్రతిరోజు ఆహారంలో తీసుకునే వారని మన పెద్దవాళ్లు చెబుతుంటే వినే ఉంటారు. అప్పటికీ.. ఇప్పటికీ తేనె ప్రతిరోజు ఏదో రకంగా ఉపయోగించే వాళ్లు ఉన్నారు. అలాంటి తేనెను ఆహారంగానూ తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరగడం సహా చర్మంపై ఏర్పడే కొన్ని ఇన్ఫెక్షన్స్ కు మందుగా పనిచేస్తుంది. 

చర్మ సమస్యలకు సంబంధించిన చికిత్స కోసం బొడ్డుపై తేనెను పూయడం వల్ల జీర్ణక్రియకు సక్రమంగా జరుగుతుంది. దీని వల్ల కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్ అయినా తొలగిపోతుంది. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారడం, మొటిమల సమస్యలను దూరం చేస్తుంది. అయితే తేనె వల్ల కలిగి మరికొన్ని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.  

చర్మం పొడిబారడం తగ్గుతుంది..

చర్మ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే.. బొడ్డుపై తేనెను రాయడం వల్ల మేలు కలుగుతుంది. దీంతో చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. తేనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉన్నాయి. దీంతో పాటు తేనె అంటువ్యాధుల నుంచి శరీరానికి రక్షణనిస్తుంది. మొటిమల సమస్యలు ఉన్న వారు కొన్ని చుక్కల స్వచ్ఛమైన తేనెను నాభిపై వేయండి. మొటిమల సమస్య దూరమవుతుంది.

ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దీని తీసుకోవడం వల్ల జలుబు తగ్గుతుంది. ఒక చుక్క అల్లం రసం, తేనె కలపి నీటితో తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ బొడ్డు (నాభి)ను సరిగ్గా శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్ రావచ్చు. తేనెలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బొడ్డు ఇన్ఫెక్షన్‌ను నివారిస్తాయి.

కడుపు నొప్పికి ఉపశమనం

తేనె తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు, అజీర్ణం నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం రసంలో తేనె కలపడం వల్ల జీర్ణవ్యవస్థ చాలా బాగుంది. కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇది ఇంటి చిట్కా.

మలబద్ధకం నుంచి ఉపశమనం

మలబద్ధకం (లూజ్ మోషన్ ప్రాబ్లం) సమస్యకు రోజువారి ఆహారంలో తేనెను తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో తేనె కలుపుకుని తాగడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. నాభిపై తేనె కలుపుకుంటే ప్రయోజనం ఉంటుంది. తేనె తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఎలా ఉపయోగించాలి?

రోజులో గంట నుంచి 2 గంటలు విశ్రాంతి తీసుకునే క్రమంలో బొడ్డుపై తేనెను వేసుకొని విశ్రాంతి తీసుకోవాలి. బొడ్డులో తేనె వేయడం వల్ల అనారోగ్య లక్షణాలను తగ్గించడంలో తోడ్పడుతుంది. లేదంటే రాత్రివేళ నిద్రించే ముందు నాభిపై తేనెను వేసుకొని నిద్రించవచ్చు. 

Also Read: Hangover Remedies: 31 నైట్ హ్యాంగోవర్ ఆ?.. ఇలా చేస్తే హ్యాంగోవర్ చిటికెలో మాయం!

Also Read: Smart Watch Disadvantages: స్మార్ట్ వాచ్ లు శరీరానికి మేలు కంటే హానీ ఎక్కువని మీకు తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  

Trending News